E-Paper
Advertisement

ఇక యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఇక యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే తిప్పలు బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Advertisement

Fertilizer App: స్వేచ్చ బ్యూరో: ప్రజా ప్రభుత్వం రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫర్టిలైజర్​ యాప్​ దేశానికే రోల్​ మోడల్ గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు చెపారు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శిగా మారిందన్నారు. ఫర్టిలైజర్ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ విజిబిలిటీ, రైతు వారి డిజిటల్ బుకింగ్, పంటల ఆధారిత ఎరువుల కేటాయింపు, డాష్ బోర్డు పర్యవేక్షణ, డేటా ఆధారిత సరఫరా వ్యవస్థ వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసి డిజిటల్ వ్యవసాయ పరిపాలనకు తెలంగాణ మోడల్ గా నిలిచిందని ప్రశంసించినట్టు చెప్పారు.

యూరియా దుకాణాల్లో స్టాక్ సమాచారం..

యూరియా కొరతపై ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించాయని విమర్శించారు. రైతులు ముసుగులో రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు జరిపి దిగజారుడు రాజకీయం చేశారని మండిపడ్డారు. రైతులకు మేలు చేసేలా ప్రజా ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రూపకల్పన చేసినట్లు తుమ్మల పేర్కొన్నారు. యాప్ వల్ల యూరియా దుకాణాల్లో స్టాక్ సమాచారం రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల ఎలాంటి ఆందోళన లేకుండా బుకింగ్ చేసుకుని యూరియా తీసుకోవచ్చన్నారు.

Advertisement

Also Read: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

క్యూ లైన్ లకు చెక్ పెట్టిన యాప్..

యూరియా కోసం క్యూ లైన్స్ లో రైతులు ..నిలబడే ఓపిక లేక చెప్పులు క్యూ లైన్స్ లో పెట్టిన రైతులు.. సొమ్మసిల్లి పడి పోయిన రైతులు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేసే రాజకీయ నాయకులు వల్ల రైతులు ఆందోళనకు లోనయ్యారని చెప్పారు. దాంతో అవసరానికి మించి యూరియా బస్తాలు కొని స్టాక్ పెట్టారన్నారు. దీనివల్ల తోటి రైతులు యూరియా అందక ఇబ్బందులు పడ్డారన్నారు. జియో పాలిటిక్స్ వల్ల కేటాయించిన యూరియాను కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరఫరా చేయక పోవటం వల్ల తెలంగాణ లో తలెత్తిన కొరతపై రేవంత్ సర్కార్ ను బద్నాం ప్రతిపక్షాలు కుట్రలు చేశాయన్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ జాతీయ స్థాయిలో మార్గదర్శిగా మారిందన్నారు.

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్..

Advertisement

సాంకేతికత ద్వారా ఎరువుల పంపిణీలో దీర్ఘకాలిక సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో తెలంగాణ నమూనా కేంద్ర ప్రభుత్వానికి మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగానికి మేలైన సేవలు అందించేలా టెక్నాలజీ ఆధారిత సేవలను మరింత మెరుగు పరచాలన్న ముఖ్యమంత్రి పట్టుదలతో తెచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ జాతీయ స్థాయిలో రోల్ మోడల్ గా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో యూరియా కోసం క్యూ లైన్లు, తోపులాటలు ఉండేవన్నారు. కానీ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల ఆన్ లైన్ లో బుక్ చేసుకుని టైం ప్రకారం వెళ్ల్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా బస్తాలు తెచ్చుకుంటున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

Also read: ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Related News

‘తెలంగాణ మా జాగీర్.. అవమానిస్తే ఊరుకోం’.. పవన్‌పై మళ్లీ విరుచుకుపడ్డ కవిత

హైదరాబాద్‌లో ఎబోలా కలవరం.. ఒకరికి నెగటివ్, రెండో కేసుపై ఉత్కంఠ!

నీట్ పరీక్ష రద్దు వెనుక అసలు నిజాలివే.. కేంద్రంపై విరుచుకుపడ్డ మహేష్ కుమార్ గౌడ్!

రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం

తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!

సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడతావా? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన కామెంట్స్.. ‘గాలి మోటార్’ అస్త్రంతో స్ట్రాంగ్ కౌంటర్!

నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ సవాల్!

Big Stories

Advertisement
×