Rohit Sharma Fans: తన అభిమానుల కోరిక తీర్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit sharma ). రేపటి నుంచి… బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… తాజాగా తన ఫ్యాన్స్ కోరిక తీర్చి అందరిని ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. గురువారం అంటే రేపటి నుంచి బాక్సింగ్ డే టెస్టు.. మెల్ బోర్న్ స్టేడియంలో ( melbourne stadium) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… స్టేడియంలో మొన్నటి నుంచి… టీమిండియా ప్లేయర్లు చాలా కష్టపడుతున్నారు. ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నారు టీమ్ ఇండియా ప్లేయర్లు.
అయితే ఎం సి జి గ్రౌండ్ లో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా… ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్స్.. ఎం సి జి కి చేరుకుంటున్నారు. టీమిండియా ప్లేయర్ల ప్రాక్టీస్ మ్యాచ్ ను చూస్తున్నారు. నెట్స్ లో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న సందర్భాన్ని దగ్గరుండి చూస్తున్నారు ఇండియన్స్.
పెద్ద సంఖ్యలో మెల్బోర్న్ స్టేడియానికి టీమిండియా ( Team india ) ఫ్యాన్స్ చేరుకుంటున్నారు. ఈ తరుణంలోనే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit sharma ) బయటకు వచ్చి… అభిమానులను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆప్యాయంగా మాట్లాడారు రోహిత్ శర్మ ( Rohit sharma ). టీ షర్ట్స్, బుక్స్, అలాగే బ్యాట్ల పైన రోహిత్ శర్మ ( Rohit sharma ) ఆటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అయితే రోహిత్ శర్మ ( Rohit sharma ) ఆటోగ్రాఫ్ ఇవ్వగానే… టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ శర్మ పెద్ద మనసును అర్థం చేసుకొని… హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇండియన్స్. రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ ను చూపిస్తూ… ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఇది ఇలా ఉండగా… బోర్డర్ గ భాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటు లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Vinod Kambli: ఆస్పత్రి బెడ్ పై ఎమర్జెన్సీ వైద్యం.. పాట పాడిన టీమిండియా ప్లేయర్?
ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తీ అయ్యాయి. మరో రెండు మ్యాచ్లు… ఆడాల్సి ఉంది. ఈ తరుణంలో… నాలుగవ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని టీమిండియా చాలా కసరత్తులు చేస్తోంది. చెరొక మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి టీమిండియా అలాగే ఆస్ట్రేలియా. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే టీమిండియా ఇప్పుడు కచ్చితంగా రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్లు గెలిస్తేనే డబ్ల్యూటీసి కి వెళ్తుంది.
ROHIT SHARMA, THE FAN FAVOURITE….!!!! 🙇
– Captain Rohit with fans at MCG, giving autographs to all. [RevSportz] pic.twitter.com/97CGAR766C
— Johns. (@CricCrazyJohns) December 24, 2024