Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళబోతున్నాడా..? ప్రస్తుతం ఈ ప్రశ్న క్రికెట్ వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది. క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు ఈ ప్రశ్నపైనే చర్చించుకుంటున్నారు. కారణం ఏంటంటే..? 8 సంవత్సరాల తర్వాత మళ్లీ ఛాంపియన్ ట్రోఫీ రాబోతుంది. 8 జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగబోతోంది.
అలాగే 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కానీ భద్రతా కారణాల దృశ్య టీమిండియా ఆ దేశానికి వెళ్లడం. భారత్ కి సంబంధించిన పూర్తి మ్యాచ్ లు దుబాయ్ లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా ఈవెంట్ కి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం పాకిస్తాన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ కి ముందు, ట్రోఫీలో పాల్గొనే జట్ల కెప్టెన్ల అందరి ఫోటోషూట్ తో కూడిన కార్యక్రమం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫోటోషూట్ తర్వాత విలేకరుల సమావేశం కూడా నిర్వహిస్తారు. టోర్నమెంట్ ని అధికారికంగా నిర్వహించే దేశంలో ఇటువంటి కార్యక్రమం తరచూ జరుగుతుంటుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి పాకిస్తాన్ అధికారిక హోస్ట్ గా ఉన్నందున.. మొత్తం ఎనిమిది మంది కెప్టెన్లతో కూడిన అధికారిక కెప్టెన్ల ఫోటోషూట్ టోర్నమెంట్ ప్రారంభమయ్యే పాకిస్తాన్ లో నిర్వహిస్తారు.
అయితే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫోటోషూట్ కోసం పాకిస్తాన్ కు వెళ్తాడా..? లేదా..? అన్నది ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఫోటోషూట్ కోసం రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళితే మాత్రం సెన్సేషన్ అవుతుంది. కానీ రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే ఆ దేశంతో దౌత్య పరంగా ఉన్న సమస్యల నేపథ్యంలో బీసీసీఐ రోహిత్ శర్మని పాకిస్తాన్ కి పంపే సాహసం చేయదని విశ్లేషకుల అంచనా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నట్లే.. ఫోటోషూట్ ని కూడా అదే విధంగా ఫాలో అవుతారని సమాచారం.
Also Read: Virat Kohli Restaurant: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో నిలువు దోపిడీ.. మరీ ఇంత దారుణమా..?
ఫోటోషూట్ నీ కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ ఫోటోషూట్ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్ లో ఎప్పుడూ పాకిస్తాన్ కి వెళ్ళలేదు. ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 20న దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ని ఆడబోతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న భారత్ – పాకిస్తాన్ మధ్య 2 మ్యాచ్ జరగబోతోంది.