Shahid Afridi: ఐర్లాండ్ ( Ireland) చేతిలో టీమిండియా ( Team India) చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ ( White Wash) అయిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ గతంలో ఎన్నడూ ఓడిపోయినట్లే వ్యవహరిస్తున్నారు. ఐర్లాండ్ చేతిలో ఒక్క సిరీస్ కోల్పోయిన టీమిండియాను, దేశ ద్రోహం చేసినట్లుగానే కామెంట్స్ చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. ఇప్పటికే తన్వీర్ అహ్మద్, షోయబ్ అక్తర్ ఇద్దరూ టీమిండియా ప్రదర్శన పై స్పందించగా, తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా పతనం మొదలైంది అంటూ బాంబు పేల్చారు. టీమిండియా కు చెడ్డ రోజులు వచ్చాయని.. ఇక వాళ్లను దేవుడు కూడా కాపాడలేడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ ( Team India Vs Ireland) మధ్య జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీం ఇండియాకు చెడు సమయం మొదలైందని వ్యాఖ్యానించారు. టీమిండియా పతనం ఇప్పుడే మొదలైందని.. ఆ దేవుడు దిగివచ్చిన వాళ్లను కాపాడలేదని బాంబు పేల్చారు. ఐర్లాండ్ చేతిలో ఓడినట్లుగానే, మా చేతిలో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అంటూ ఛాలెంజ్ విసిరారు. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని.. ఆ సమయంలో వాళ్లను దెబ్బ కొడతామని హెచ్చరించారు.
ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో కూడా 5 టీ20 లో ఓడిపోతుందని అంచనా వేశారు. వైభవ్ సూర్య వంశీ ఆడితే గెలుస్తామని.. టీమిండియా ప్లేయర్లు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారని చురకలు అంటించారు. వైభవ్ కాదు వాళ్ళ అయ్య దిగివచ్చినా టీమిండియా గెలవడం అసాధ్యం అంటూ హేళన చేశారు. ఇకపై టీమిండియా గెలవాలంటే, ఐపీఎల్ టోర్నమెంట్ను వదిలివేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ లో ఫ్లాట్ ట్రాక్స్ పైన ఆడడం నేర్చుకున్న టీమిండియా ప్లేయర్లు.. విదేశీ గడ్డలపై ఫెయిల్ అవుతున్నారని పరువు తీశారు. అందుకే ఐర్లాండ్ లాంటి బుడ్డ టీం చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు షాహిద్ అఫ్రిది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఒక సిరీస్ ఓడిపోతే టీమిండియా పతనం అయినట్టు కాదని స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.