E-Paper
Advertisement

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు
Advertisement

Tanveer Ahmed On Abdullah Shafique: వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan) మధ్య ఆగస్టు రెండవ తేదీన ప్రారంభమైన రెండు టెస్టులో బాబర్ ఆజం సేన విక్టరీ అందుకుంది. దీంతో ఈ టెస్ట్ సిరీస్ ను రెండు జట్లు 1-1 తేడాతో పంచుకున్నాయి. అయితే రెండో టెస్టులో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ ( Abdullah Shafique) ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టును ఆదుకుంది అబ్దుల్లా షఫీకే. 160 పరుగులు చేసి, కీలక సమయంలో జట్టును గాడిలో పెట్టగలిగాడు. ఈ క్రమంలో అబ్దుల్లా షఫీక్ బ్యాటింగ్ పై పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని యూనిస్ ఖాన్ లాగా పోల్చుతున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) కూడా అబ్దుల్లా షఫీక్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పాకిస్తాన్ సింహం అంటూ కితాబు ఇచ్చారు. అతడి ముందు ఏ క్రికెటర్ కూడా పనికిరాడు అని చురకలు అంటించారు. టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ (Shubman Gill) కూడా అబ్దుల్లా షఫీక్ ముందు జుజుబీ అంటూ హేళన చేశారు.

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు

వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో 160 పరుగులు చేసిన అబ్దుల్లా షఫీక్ ను ఆకాశానికి ఎత్తారు తన్వీర్ అహ్మద్. పాకిస్తాన్ జట్టులో ఇప్పటివరకు ఇలాంటి క్రికెటర్ ను తాను ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. టీమిండియా కెప్టెన్ గిల్ కంటే అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించారు. కీలక సమయంలో పాకిస్తాన్ జట్టును ఆదుకుని… వెస్టిండీస్ ను ఓడించడంలో కృషి చేశాడని వెల్లడించారు. అతడిని పాకిస్తాన్ సింహం అంటూ పోస్ట్ పెట్టారు తన్వీర్ అహ్మద్. ఇలాంటోడు పాకిస్తాన్ జట్టుకు అవసరమని వెల్లడించారు. బాబర్ ఆజం సేనలోకి అబ్దుల్లా షఫీక్ లాంటి ఆటగాళ్లు మరికొంతమంది రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

బాబర్ ఆజంకు నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వాల్సిందే

మూడు సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై పాకిస్తాన్ టెస్ట్ జట్టు మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది కూడా బాబర్ ఆజం కెప్టెన్సీ లోనే గెలవడం గమనార్హం. ఈ క్రమంలో వన్డేలు, టి20 లు, టెస్టుల్లో బాబర్ ఆజంకు నెంబర్ వన్ ర్యాంక్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు 48వ ర్యాంక్ ఇచ్చినప్పుడు.. బాబర్ ఆజంకు ఎందుకు ఇవ్వబోరని మండిపడ్డారు. బాబర్ ఆజం కు మూడు ఫార్మాట్స్ లలో నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చేవరకు తన పోరాటం ఆగబోదని వెల్లడించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను కూడా రోడ్డుకు కూడా ఈడ్చుతానని హెచ్చరించారు. ఇండియన్ క్రికెటర్లకు ఐసీసీ ఎప్పుడు కూడా అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. కానీ బాబర్ విషయంలో ఐసీసీ దుర్మార్గంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

Related News

వెస్టిండీస్ ను ఓడించాం, నా నెక్ట్స్ టార్గెట్ టీమిండియానే

పాకిస్తాన్ కుక్క‌ల‌కు కూడా ఐపీఎల్ లో ఎంట్రీ లేదు..అమీర్ కు హ‌ర్భ‌జ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్

మ‌హ్మ‌ద్ అమీర్ లాగానే, పాకిస్తాన్ దేశాన్ని వ‌దిలేస్తోన్న‌ ఖుష్దిల్ షా

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

Big Stories

Advertisement
×