E-Paper
Advertisement

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక
Advertisement

Tanveer Ahmed blasts Wasim Akram: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (PAK VS ENG) మధ్య మొన్నటి వరకు జరిగిన మూడు టెస్టుల సిరీస్ విజయవంతంగా సక్సెస్ అయింది. అయితే ఈ టోర్నమెంటులో పాకిస్తాన్ వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను (Babar Azam) ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఆడడానికి వెళ్ళావా..? లేదా ఇంగ్లాండులో శనగలు అమ్ముకున్నావా ? అంటూ ఫైర్ అయ్యారు. జట్టులో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదా? అంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శలు నేపథ్యంలో వెంటనే తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయి… బాబర్ ఆజంను వెనుకేసుకొచ్చారు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా బూతులు తిట్టడం అవసరమా? అంటూ ఫైర్ అయ్యారు. అనవసరంగా బాబర్ ఆజంను తిడితే… ఎవరని చూడకుండా పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు. దీంతో తన్వీర్ అహ్మద్ (Pak Tanveer Ahmed) ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ అయింది.

అసలు బాబర్ ఆజంను వసీం అక్రమ్ ఎందుకు తిట్టాడంటే ?

ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ సందర్భంగా మొత్తం ఏడుగురు క్రికెటర్లను తొలగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇద్దరు కోచ్ లను కూడా తొలగించి… పాకిస్తాన్ పంపింది. అయితే ఈ సంఘటనపై బాబర్ ఆజం మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడుగురు క్రికెటర్లను తొలగించిన విషయం తనకు తెలియదన్నారు. తన పర్మిషన్ లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ పని చేసిందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై, వసీం అక్రమ్ సీరియస్ అయ్యారు. ఇంగ్లాండ్ వెళ్లి శనగలు అమ్ముకుంటున్నావా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జట్టులో ఏం జరుగుతుందో తెలియకుండా… కెప్టెన్ గా ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు.

Advertisement

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

వసీం అక్రమ్ కు కౌంటర్ ఇచ్చిన తన్వీర్ అహ్మద్

బాబర్ ఆజంను శనిగలు అమ్ముకుంటున్నావా ? అంటూ వసీం అక్రమ్ విమర్శించగా… దానికి తన్వీర్ అహ్మద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాబర్ ఆజంను ఒక్కడినే.. ఇలా విమర్శించడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. బాబర్ కు తెలియకుండానే ఆ ఏడుగురు క్రికెటర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలగించాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విషయం తెలియక, బాబర్ ఇంగ్లాండ్ లో పిచ్చోడయ్యాడని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తిట్టాలి కానీ…. బాబర్ లాంటి కెప్టెన్ ను తిట్టకూడదని రిక్వెస్ట్ చేశారు. అలా కాదని హద్దులు ఎవరైనా మీరితే… తాను చేతులతో పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

Related News

CSK కోచ్ గా జ‌హీర్ ఖాన్…ఆందోళ‌న‌లో ధోని ఫ్యాన్స్ ?

రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

నా బౌలింగ్ దెబ్బకు ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడు

బీహార్‌లో పుట్టి పెరిగాడు..ఇప్పుడు జపాన్ తరఫున ఆడుతున్నారు, ఇంతకీ ఎవరీ అభిషేక్ ఆనంద్ ?

అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీని ఆడించ‌కండి..మ‌రో ప్లేయ‌ర్ ను చూసుకోండి !

రిజ్వాన్‌ను ‘బలిపశువు’ను చేసి ఆడుకుంటున్నారు…షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×