E-Paper
Advertisement

ఆసియా క‌ప్ గెలిస్తే, అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే

ఆసియా క‌ప్ గెలిస్తే, అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే
Advertisement

Tanveer Ahmed On Asia Cup 2026:  మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Dubai International Cricket Stadium) వేదికగా ఆసియా కప్ టోర్నమెంట్ 2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. మొత్తం ఈ టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్లో కనీసం రెండుసార్లు అయిన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మహిళల జట్ల మధ్య ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ముందుగా గ్రూప్ స్టేజిలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సెప్టెంబర్ 5వ తేదీన బిగ్ ఫైట్ ఉండనుంది. అయితే ఆసియా కప్ 2025 సందర్భంగా టీమిండియా పురుషుల జట్టు టైటిల్ గెలిచినప్పటికీ.. మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi) కారణంగా ఆ టైటిల్ సూర్యకుమార్ యాదవ్ తీసుకోలేదు. ఇక ఈసారి మహిళల టోర్నమెంట్ సందర్భంగా కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ తీసుకోవాల్సిందే

Advertisement

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో టీం ఇండియా టైటిల్ గెలిస్తే పరిస్థితి ఏంటనే దానిపైన తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురుషుల ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ చాలా మొండిగా వ్యవహరించి ట్రోఫీ తీసుకు వెళ్లలేదని మండిపడ్డారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవడం ఇష్టం లేక… వెళ్లిపోయాడని ఫైర్ అయ్యారు. అయితే ఈ మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

న‌చ్చ‌క‌పోతే, ఆసియా క‌ప్ 2026 నుంచి త‌ప్పుకోండి

Advertisement

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Women’s Asia Cup 2026 Tournament) ఎవరు గెలిచినా మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవాల్సిందేనని వెల్లడించారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ). మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోవడం ఇష్టం లేకుంటే… ముందుగానే టీమిండియా జట్టును ఎలిమినేట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీసీ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోకపోతే.. అతనికి ఇచ్చే గౌరవం ఏంటని ప్రశ్నించారు. ఈ మహిళల టోర్నమెంట్ సందర్భంగా ఒకవేళ మహిళల టీమిండియా టైటిల్ గెలిస్తే ఖచ్చితంగా మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందేనని వెల్లడించారు. దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే టోర్నమెంట్ నుంచి వైదొలగాలని కోరారు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

Related News

విరాట్ కోహ్లీనే రియ‌ల్ కింగ్…అత‌ను పాకిస్తాన్ లో పుట్టుంటే బాగుండేది

ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఆడి, ఇంగ్లండ్‌లో.. పాకిస్తాన్ ప‌ళ్లు రాల‌గొట్టుకుంది

పార్టీలు, అమ్మాయిలకు అభిషేక్ శర్మ బానిస అయ్యాడు..యోగ్‌రాజ్ సింగ్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×