E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !

గంభీర్ నీకు బుర్ర ఉందా ? అంత దూల ఉంటే, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా పంపించుకో !
Advertisement

Trolls On Harshit Rana: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of England, 2026 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య నిన్న తొలి మ్యాచ్ జరగగా, వరుణుడు విలన్ గా మారాడు. టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసినప్పటికీ… వర్షం కారణంగా ఇంగ్లాండ్ చేజింగ్ కు దిగక ముందే మ్యాచ్ రద్దయింది. వర్షం ప్రారంభమైన తర్వాత చాలా సేపు అంపైర్లు వేచి చూశారు. కానీ వర్షం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించేశారు.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య తొలి టి20 (India tour of England, 2026 ) రద్దయిన నేపథ్యంలో హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉండగా హర్షిత్ రాణాను (Harshit Rana ) ముందుగా పంపించారు గౌతమ్ గంభీర్. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ కు (Gautam Gambhir) కొంచెం కూడా తెలివి లేదని.. హర్షిత్ రాణాను అనవసరంగా ముందుగా పంపించి తప్పు చేశారని సీరియస్ అవుతున్నారు. ఎన్నో మ్యాచ్ లు ఆడిన అనుభవం అక్షర్ పటేల్ కు ఉందని.. అతడి స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

అలాంటి వాడిని కాదని హర్షిత్ రాణాను ముందుగా పంపిస్తే.. డకౌట్ అయ్యాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అక్షర్ పటేల్ కంటే తన పెద్దకొడుకు హర్షిత్ రాణా ఎక్కువ అయ్యాడా ? గౌతమ్ గంభీర్ కు కొంచెం కూడా బుర్ర లేదు అంటూ ఓ రేంజ్ లో సీరియస్ అవుతున్నారు. హర్షిత్ రాణా స్థానంలో అక్షర్ పటేల్ ను పంపించి ఉంటే, టీమిండియా మరిన్ని పరుగులు చేసేదని తెలిపారు. అనవసరంగా హర్షిత్ రాణాకు ఎక్కువగా గౌతమ్ గంభీర్ ప్రాధాన్యత ఇస్తున్నాడని మండిపడుతున్నారు. ఇకనైనా హర్షిత్ రాణాను బౌలర్ గానే ట్రీట్ చేయాలని… అతడిని గొప్ప ఆల్ రౌండర్ చేసే ఆలోచన గంభీర్ మానుకోవాలని చురకలు అంటిస్తున్నారు.

ఆస్పత్రి బెడ్ పైన ఉన్నవాడికి నేరుగా టీమిండియాలో ఛాన్స్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు హర్షిత్ రాణాకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండు అలాగే ఏషియన్ గేమ్స్ కోసం సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీనంతటికీ కారణం గౌతమ్ గంభీర్. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లాంటి క్రికెటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఆసుపత్రి నుంచి వచ్చిన హర్షిత్ రాణాకు ఎలా ఛాన్స్ ఇస్తారని క్రీడా విశ్లేషకులు కూడా నిలదీశారు. దేశ వాళిలో రాణించిన తర్వాత హర్షిత్ ను తీసుకోవాలి తప్ప… ఇలా నేరుగా టీమిండియాలోకి గాయాల పాలు అయిన వాళ్లను ఎందుకు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

Related News

టీ20ల‌ను టెస్టుల్లా ఆడుతున్నాడు..తిల‌క్ కంటే బాబ‌ర్ ఆజం బెట‌ర్‌

Tanveer Ahmed: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

భూమికి జానెడు లేరు…గంభీర్ కు మాస్ వార్నింగ్, వైభ‌వ్ క్లాస్ మెట్స్ వీడియో వైర‌ల్

ఇంగ్లండ్ మ్యాచ్ లో క్షుద్ర పూజ‌లు..అభిషేక్ శ‌ర్మ వ్య‌వ‌హారంపై అనుమానాలు!

‘ఒరేయ్’ వైభవ్ అంటూ రెచ్చిపోయిన తెలుగు అభిమాని..ఇంగ్లండ్ లోనూ ప‌రువు తీశారు!

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు

ఇషాన్ కిష‌న్ కు అభిషేక్ వెన్నుపోటు..మైదానంలోనే గొడ‌వ‌కు దిగిన ప్లేయ‌ర్లు !

Big Stories

×