E-Paper
Advertisement

ధ్రువ్ జురెల్ వికెట్ పై వివాదం…తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు !

ధ్రువ్ జురెల్ వికెట్ పై వివాదం…తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు !
Advertisement

UltraEdge Controversy On Dhruv Jurel:   టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలే వేదికగా తొలి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో ఇప్పటికే మూడు రోజులు పూర్తి కాగా… ఇవాళ నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టగలిగింది టీమిండియా. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో కాసేప‌టి క్రిత‌మే శ్రీలంక కూడా బ్యాటింగ్ కు దిగింది.

ధ్రువ్ జురెల్ వికెట్ పై వివాదం…అల్ట్రా ఎడ్జ్ పై అనుమానాలు

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ( DHRUV JUREL) వికెట్ పై వివాదం రాజకుంది. ఆసిత్ ఫెర్నాండో వేసిన ఓ అద్భుతమైన షార్ట్ డెలివరీని ధ్రువ్ జురెల్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతి, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా చేతిలో పడింది. అయితే బంతి ధ్రువ్ జురెల్ బ్యాట్ కు తగిలిందని అప్పీల్ చేశారు శ్రీలంక ఫీల్డర్స్. అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయినప్పటికీ తగ్గని శ్రీలంక క్రికెటర్లు.. పూర్తి విశ్వాసంతో రివ్యూకు వెళ్లారు. అయితే, రివ్యూలో ధ్రువ్ జురెల్ బ్యాట్ కు బంతి ఎక్కడా తగిలినట్లు కనిపించలేదు. బ్యాట్ అలాగే బంతికి స్పష్టమైన గ్యాప్ కనిపించింది. కానీ అల్ట్రా ఎడ్జ్ లో మాత్రం స్పష్టమైన స్పైక్ ( UltraEdge Controversy On Dhruv Jurel) నమోదు అయింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించేశాడు. ఈ వికెట్ పై ఇండియన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

అల్ట్రా ఎడ్జ్ పై అనుమానాలు.. ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు

టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ( DHRUV JUREL) వికెట్ విషయంలో అల్ట్రా ఎడ్జ్ తప్పుగా చూపించిందని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇండియాను ఓడించాలని శ్రీలంక కుట్రలకు తెర లేపిందని ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఆల్ట్రా ఎడ్జ్ లో శ్రీలంకకు అనుకూలంగా రిజల్ట్ ఉండేలా చిప్పులు ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఇదంతా ఫిక్సింగ్ లో భాగంగానే జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. శ్రీలంక బోర్డుకు థ‌ర్డ్ అంపైర్ అమ్ముడుపోయాడని అంటున్నారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం చాలా భిన్నంగా స్పందిస్తున్నారు.

Advertisement

రిప్లై లో బ్యాట్ కు బంతి తగలనట్టు చూపించింది అని అంటున్నారు. కానీ అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ధ్రువ్ జురెల్ బ్యాటు తన ప్యాడ్ కు తగిలిన శబ్దాన్ని, అల్ట్రా ఎడ్జ్ స్వీకరించి.. బంతి తగిలినట్లుగా స్పైక్ చూపించినట్లు చెబుతున్నారు. ఈ అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీ అనేది మైక్రోఫోన్ ఆధారంగా శబ్దాన్ని పట్టుకుంటుంది.. అందుకే రాపిడి ఎక్కడ జరిగినా ఆ శబ్దాన్ని రికార్డ్ చేసి, బంతి తగిలినట్లు చూపించినట్లు స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫిక్సింగ్, త‌ప్పుడు నిర్ణ‌యాలు జ‌రుగ‌లేద‌ని క్లారిటీ ఇస్తున్నారు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×