E-Paper
Advertisement

నా బౌలింగ్ దెబ్బకు ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడు

నా బౌలింగ్ దెబ్బకు ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడు
Advertisement

Umar Gul On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పాకిస్తాన్ ఒకప్పటి స్టార్ బౌలర్ ఉమర్ గుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బౌలింగ్ దెబ్బకు మహేందర్ సింగ్ ధోని మైండ్ బ్లాకై…క్లీన్ బౌల్డ్ అయ్యాడంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ధోనిని తీవ్ర ఒత్తిడికి లోను చేసి, వికెట్ తీసినట్లు వెల్లడించారు. తన దెబ్బకు 11 బంతుల్లో కేవలం 6 పరుగులు చేసి, వికెట్ సమర్పించుకున్నాడంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకిస్తాన్ మాజీ ఉమర్ గుల్..ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

పక్కా ప్లాన్ తోనే మహేంద్ర సింగ్ ధోని వికెట్ పడగొట్టాను  

2007  టీ20 ఫైనల్స్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ తరుణంలోనే ధోని వికెట్ తీయడంపై పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్స్ అయిన తరుణంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని త్వరగా ఔట్ చేయాలని డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్ వేసుకున్నామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఉమర్ గుల్. ఇందులో భాగంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఎక్కువగా బౌన్సర్లు సంధించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్లు తనను హెచ్చరించారని గుర్తు చేశారు.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

అయినప్పిటికీ తాను ఎక్కడా తగ్గలేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వరుసగా బౌన్సర్లు ఎదుర్కొని విసిగిపోయాడన్నారు. తన తర్వాతి బంతిని ఎలాగైనా సిక్సర్ లేదా బౌండరీ కొడతాడని ముందే ఊహించినట్లు వివరించారు. అయితే, ఆ సమయంలో తాను యార్కర్ వేసినట్లు వెల్లడించారు. ఈ దెబ్బకు మహేంద్ర సింగ్ ధోని క్లీన్ బౌల్డ్ అయినట్లు స్పష్టం చేశారు. దీంతో తమ ప్లాన్ వర్కౌట్ అయినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఉమర్ గుల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా

Advertisement

2007 టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ మ్యాచ్ టీమిండియా, పాకిస్తాన్ మధ్యే జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లు ఆడేసింది.  ఈ క్రమంలోనే 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. ఇక టార్గెట్ ఛేదించే క్రమంలో పాకిస్తాన్ కూడా చివరి వరకు పోరాడింది. కానీ 19.3 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, మిస్బా క్యాచ్ ఔట్ కావడంతో ఆలౌట్ అయింది. దీంతో తొలి సారి ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది టీమిండియా.

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News

బీహార్‌లో పుట్టి పెరిగాడు..ఇప్పుడు జపాన్ తరఫున ఆడుతున్నారు, ఇంతకీ ఎవరీ అభిషేక్ ఆనంద్ ?

అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీని ఆడించ‌కండి..మ‌రో ప్లేయ‌ర్ ను చూసుకోండి !

రిజ్వాన్‌ను ‘బలిపశువు’ను చేసి ఆడుకుంటున్నారు…షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వైభ‌వ్ ఇదేం తిండిరా… కుంభకర్ణుడిలా తింటే ఎలా రా నాయ‌నా ?

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌..ఇంగ్లాండ్ కు శనగలు అమ్ముకోవడానికి వెళ్లావా?

వైభ‌వ్ కు టెక్నిక్ లేదు…క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

Big Stories

Advertisement
×