
Virat Kohli Diet: 140 కోట్ల మంది భారతీయులకే కాదు…క్రికెట్ ని ఇష్టపడే దేశాల్లోని అభిమానులు అందరూ కూడా విరాట్ కొహ్లీ రోజూ ఏం తింటాడు? ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్…ఇలా నిజం చెప్పాలంటే అతని ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయనే క్యూరియాస్టీ అందరిలో ఉంటుంది.
ఎందుకంటే కొహ్లీ ఫిట్ నెస్ చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంటుంది. 34 ఏళ్ల వయసులో కూడా వికెట్ల మధ్య అతను పరుగెత్తే తీరు, అంతేకాదు ఫీల్డింగులో కూడా బాల్ పై చిరుతలా లంఘించే తీరును ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
ఒక్క విరాట్ కొహ్లీ అనే కాదు, ఇండియన్ క్రికెటర్లు ఎక్కువగా ఇష్టపడే టిఫిన్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది. ఇండియన్ టీమ్ తాజాగా బస చేసిన లీలా ప్యాలెస్ హోటల్ చెఫ్ అనుష్మన్ బాలీ ఈ వివరాలను వెల్లడించాడు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని విరాట్ తీసుకుంటున్నట్టు ఆయన ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు.
కొహ్లీ డైట్ ఎలా ఉంటుందంటే, ఉడికించిన ఆహారాన్ని తింటాడు. కూరగాయలతో కూడిన ‘డిమ్ సుమ్’ అనే చైనీస్ ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేస్తుంటాడు. సోయా, మాక్ మీట్స్, టోపు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. పాలపదార్థాలకు దూరంగా ఉంటాడని చెఫ్ చెబుతున్నారు. అయితే చాలామంది చికెన్, మటన్ లాంటి మాంసాహారాలను ఎక్కువ ఇష్టపడతాడని అనుకుంటూ ఉంటారు. కానీ తను పూర్తిగా వెజిటేరియన్. మాంసాన్ని ఆహారంగా తీసుకోడు.
ఇండియన్ టీమ్ కి ఇష్టమైనది ఏమిటో తెలుసా మీకు… రాగి దోశలంటే ఎగబడి తింటున్నారని,ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా రాగి దోసెలు తీసుకునేందుకు ప్లేయర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. మిల్లెట్ దోసెలు, మిల్లెట్ ఇడ్లీలు, క్వినోవా ఇడ్లీలు లాంటివి మా మెనులో ఉంటున్నాయి. ఎందుకంటే ప్లేయర్లకు ప్రొటీన్ ఆహారం అవసరం అని వీటినెక్కువగా ఉపయోగించి ప్రత్యేకంగా చేస్తుంటామని చెఫ్ వివరించాడు.
అయితే టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తను ఆడే ఆరో మ్యాచ్ ను ఆదివారం ఇంగ్లండ్ తో ఆడనుంది. ఇప్పటికే ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న ఇంగ్లండ్..తన చివరి మ్యాచుల్లోనైనా గెలిచి తిరుగు విమానం ఎక్కాలని చూస్తోంది. ఇండియా వైపు చూస్తే ఏకధాటిగా ఆరో మ్యాచ్ కూడా గెలిచి సగర్వంగా సెమీస్ లోకి వెళ్లాలని చూస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.