BigTV English

RCB IPL: కింగ్ కోహ్లీ ఉన్నా.. ఆర్సీబీ ఎందుకు ట్రోఫీ గెలవలేదు..?

RCB IPL: కింగ్ కోహ్లీ ఉన్నా.. ఆర్సీబీ ఎందుకు ట్రోఫీ గెలవలేదు..?

Royal Challengers BangaloreRoyal Challengers Bangalore: ఐపీఎల్ ట్రోఫీలను ముంబై, సీఎస్కే ఐదేసి సార్లు గెలిచాయి. కొన్ని జట్లు ఒకొక్కసారి అయినా గెలిచి పరువు నిలబెట్టుకున్నాయి. ప్రతీ సీజన్ లో అటూ ఇటుగా చివరి ప్లేస్ లో ఉండే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకసారి గెలిచింది.


మరి ఆర్సీబీ ఎందుకు ట్రోఫీ తీసుకురాలేక పోతోంది.
ఆఖరికి అమ్మాయిలు కూడా ట్రోఫీ కొట్టుకొచ్చారు.
ఇప్పుడు అబ్బాయిల జట్టుపై ప్రెజర్ మరింత ఎక్కువైంది. ఒకసారి ఆ జట్టు ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం..

ఐపీఎల్ లో ఎన్ని జట్లున్నా.. మొదట అందరినోటా వినిపించే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే ఇందులో విరాట్ కొహ్లీ ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి తను అదే జట్టుతో ఉన్నాడు. ఇప్పటికి 16 ఏళ్లు గడిచిపోయాయి. కానీ కప్ అయితే ఆర్సీబీ గెలవలేదు. 2016లో రికార్డ్ స్థాయిలో 973 పరుగులు చేసి కూడా కొహ్లీ జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కానీ ఆరెంజ్ క్యాప్ మాత్రం అందుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ తరహాలోనే అదీ జరిగిపోయింది.


Also Read: Sachin Tendulkar: ఆ మాట నిజమేనా?.. కొడుకు కోసం సచిన్ ఆ పని చేశాడా?

2009, 2011, 2016 మూడుసార్లు ఆర్సీబీ ఫైనల్ కి వెళ్లింది. కానీ దురదృష్టం వెంటాడి కప్ గెలవలేకపోయింది. అయితే ఆర్సీబీ వెనుకపడటానికి కారణాలు ఇవీ అని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మరి అవేమిటో చూద్దాం..

1. మంచి ఆల్ రౌండర్లు లేకపోవడం
2. బౌలింగ్ లైనప్ వీక్ గా ఉండటం
3. టాప్ స్పిన్ బౌలర్లు లేకపోవడం. చాహల్ ఒక్కడిపైనే అమితంగా ఆధారపడటం
4. బౌలింగ్ వీక్ కావడంతో ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేయడం, లేదా అలవోకగా విజయం సాధించడం
5. కేవలం బ్యాటింగ్ లైనప్ పైనే ఎప్పుడూ ఆధారపడటం. వాళ్లలో ఇద్దరు ముగ్గురు ఫెయిలైతే, అంతే సంగతి, చిత్తగించవలెను అన్నట్టుగా ఉంది.

ఇదండీ సంగతి… చూశారు కదా… మరి ఈసారైనా ఆర్సీబీ విజయం సాధిస్తుందా? వైఫల్యాలను అధిగమిస్తుందా? చూడాల్సిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×