WTC Points Table 2025-27: బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా కంగారు జట్టును వాళ్ళ సొంత గడ్డపై మట్టి కనిపించింది. ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Australia vs Bangladesh) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు (WTC Points Table 2025-27) కీలకంగా మారిన ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లోనే 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ దెబ్బకు నాలుగు రోజుల్లోనే మ్యాచ్.. ఈ మ్యాచ్ ఫినిష్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విక్టరీ సాధించడం టీమిండియాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. WTC సైకిల్ లో టీమిండియా కు లైన్ క్లియర్ చేసిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఆస్ట్రేలియా జట్టుపై మొదటి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. టీమిండియా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఓడిపోయిన క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా కు రెండో స్థానం దక్కించుకునే అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్ చేతులో ఓడిపోయిన ఆస్ట్రేలియా…WTC లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయినా 87.50 శాతం నుంచి 77.77 పర్సంటేజ్ కు దిగజారింది. అటు దక్షిణాఫ్రికా 75%తో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 72% మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇటు బంగ్లాదేశ్ 66.67%తో 4వ స్థానంలో ఉంది. టీమిండియా 48.15%తో ఐదో స్థానంలో ఉంది. అయితే, మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే, దాదాపు వాళ్లు WTC ఫైనల్ కు చేరిపోయేవాళ్లు. రెండో స్థానం కోసం మాత్రమే పోటీ జరిగేది.
కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో… మొదటి రెండు స్థానాల కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో టీమిండియా తన తదుపరి టెస్టుల్లో వరసగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళితే.. 65కు పైగా పర్సంటేజ్ సాధించి రెండో స్థానాన్ని దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈ ఏడాది చివరిలో మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా పై చేయి సాధిస్తే, WTC లో టాప్ 2 లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లను టీమిండియా గెలవాలి. అలా గెలిస్తే టీమిండియా పాయింట్ల పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్టను వెనక్కి నెట్టి మూడో స్థానానికి టీం ఇండియా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ఆస్ట్రేలియా పాయింట్లు తగ్గితే టీమిండియా కు అడ్వాంటేజ్ ఉంటుంది. WTC సైకిల్ లో టీమిండియా ఇంకా 9 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7 అయినా గెలవాలి. అప్పుడే రెండో స్థానం దక్కించుకుంటుంది.