Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చేందుకు పెద్ద ప్లానే వేసింది. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. భార్య వేసిన ప్లాన్ నుంచి భర్త తప్పించుకోని పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల ప్రకారం.. కొమిశెట్టిపల్లి రవి అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాలోని గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన భార్య కొమిశెట్టి పల్లి హరిత, తన ప్రియుడు మిరుదొడ్డి సాయి ప్రదీప్ తో కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే ప్రియుడి మోజులో పడి హరిత, తన భర్త కొమిశెట్టి పల్లి రవిని చంపేందుకు ప్లాన్ వేసింది. తాళి కట్టిన భర్తనే రోడ్డు ప్రమాదంలో చంపడానికి ప్రియుడి తో కలిసి కుట్ర పన్నింది.
కొంశెట్టిపల్లి హరిత, తన ప్రియుడు అయిన మిరుదొడ్డి సాయి ప్రదీప్, మరో వ్యక్తి దాసోజు సాయికిరణ్ లతో కలిసి హత్య ప్లాన్ చేసింది. భర్తనే హత్య చేయాలని ఒక తారు వాహనంతో ఢీకొట్టే చంపే ప్రయత్నం చేశారు. అయితే అప్రమత్తమైన భర్త రవి తప్పించుకొని పోలీసులకు పిర్యాదు చేశాడు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లో మృతి..