Investments: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. అమెరికా, దక్షిణ కొరియాల్లో పది రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం పలు అంతర్జాతీయ సంస్థ అధినేతలను, ప్రముఖ సంస్థల ప్రతినిధులను కలుసుకొని పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించేందుకు గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు సానుకూలంగా స్పందించగా, స్టాన్ ఫోర్డ్ వంటి వర్సిటీలో పరిశోధనలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి కనబరిచాయి. ఈ పది రోజులలో అమెరికా, కొరియాల నుంచి సుమారు రూ. 40 వేల కోట్ల వరకు పెట్టుబడులు ఆకర్షించటంతో సీఎం బృందం విజయవంతమైంది.
కొరియాలో….
విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల రంగంలో కొరియాలో అతిపెద్ద పరిశ్రమల గ్రూపు ఎల్‌ఎస్ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం బృందం చర్చలు జరిపింది. కార్పొరేషన్ చైర్మన్ జా ఉన్‌తో జరిగిన చర్చల్లో.. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్, విద్యుత్తు, బ్యాటరీల రంగంలో తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హ్యుందయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు హ్యుందయ్ సంస్థ అంగీకారం తెలిపింది.
Also Read: Telangana Cm: విద్యార్థినికి అండగా సీఎం, ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం
కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్‌చైర్మన్ సొయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలతో సీఎం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు.