E-Paper
Advertisement

జనాభా లెక్కలకు టైం పెంచాలంటున్న స్టాఫ్.. ఎందుకో తెలుసా..?

జనాభా లెక్కలకు టైం పెంచాలంటున్న స్టాఫ్.. ఎందుకో తెలుసా..?
Advertisement

Urban Surveys: స్వేచ్ఛ బ్యూరో: రాష్టంలోని సగం జనాభా కలిగి ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతం ఏకకాలంలో మూడు బాధ్యతలను నిర్వర్తించటంలో బిజీగా ఉన్నాయి. మూడు కార్పొరేషన్ల అధికారులు, సిబ్బంది ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్( ఎస్ఐఆర్) మొదలు కావటంతో పాటు జనాభా లెక్కల సేకరణ కోసం ప్రస్తుతం హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ ఇటీవలే మొదలైన సంగతి తెల్సిందే.

33 ప్రశ్నలతో కూడిన..

కోర్ అర్బన్ రీజియన్ లో ఈ హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టిన ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన 250 నుంచి 300 ఇళ్లకు ఒకటి నుంచి 250, లేదా 300 ఇళ్లకు నెంబరింగ్ వేసుకోవటంతో పాటు 33 ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని సేకరించటంలో బిజీగా ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికే 70 రోజులు దాటిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికుల సేకరణ వివిధ ప్రభుత్వ శాఖలకు ఓ సవాలుగా మారింది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించటంతో ప్రతి రోజు ఉదయం ప్రజాపాలన కార్యక్రమం కింద జీహెచ్ఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహిస్తూ పౌర సేవల నిర్వహణ, అభివృద్ది పనులతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెల్సుకుంటున్నారు.

కమిషనర్ సృజన..

Advertisement

కేవలం సమస్యలను స్వీకరించటమే గాక, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కారారించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మూడు కార్పొరేషన్లలో ప్రజాపాలనను సమర్థవంతంగా అమలు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఒకింత స్తబ్దత నెలకొంది. కమిషనర్ సృజన సెలవుల్లో వెళ్లటంతో ఆ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం కాస్త మందకోడిగా సాగుతున్నట్లు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలో కమిషనర్లు ఉదయం ఎస్ఐఆర్, జనాభా లెక్కల సేకరణతో పాటు ప్రజాపాలన కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.

Also Read: ఆటగాళ్ల సెలెక్షన్ అంతా ఉత్తుత్తిదే.. హెచ్‌సీఎ లీడర్ల గుట్టు రట్టు చేసిన టీసీఏ!

హౌజ్ లిస్టింగ్ లో పెరిగిన ఇండ్ల సంఖ్య

Advertisement

ఎన్యుమరేటర్లకు కేటాయించిన 250 నుంచి 300 ఇళ్లకు ఒకటి నుంచి 250 గానీ, 300 వరకు సీరియల్ నెంబర్లు వేసుకునేందుకు ఫీల్డుకు వెళ్లిన ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్ల సంఖ్య ఒక్కసారిగా మూడు నుంచి నాలుగు రేట్లు పెరిగాయి. ఈ ఇళ్ల సంఖ్యను కేటాయించిన సెన్సెస్ ప్రిన్సిపల్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్న ఇంటి నెంబర్ల ప్రకారం, ఇంటి యజమాని చెల్లించి ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్)ల ద్వారా ఇళ్ల సంఖ్యను 250 నుంచి 300 మధ్య కేటాయించారు. కానీ హౌజ్ లిస్టింగ్ కోసం నేరుగా వెళ్లిన ఎన్యుమరేటర్లకు ఒక్క ఇంటి నెంబర్ తో ఏకంగా మూడు నాలుగు అంతస్తుల భవనాలు. అందులో మూడు నుంచి నాలుగు కుటుంబాలు నివాసముండి దర్శనమివ్వటంతో వారు కుటుంబాల వారీగా ఇండ్లకు నెంబర్లు వేయటంతో అద్దెలకు ఉన్న కుటుంబాలు పెరిగి, వారికి కేటాయించిన ఇళ్ల సంఖ్య ఏకంగా మూడు నుంచి నాలుగు రేట్లు పెరుగుతున్నాయని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు.

ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్..

అధికారులు అప్పగించిన బాధ్యత ప్రకారం అది ఒకే ఇళ్లు అని, వాటిలో ఒకే కుటుంబం నివాసముంటున్నట్లు ఎన్యుమరేటర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రకమైన సంఖ్య మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే బస్తీల్లో, పేద ప్రజలెక్కువగా నివసించే మురికివాడల్లో పెరుగుతుంది. పైగా ఇళ్లను కేటాయించే సమయంలో అధికారులు 250 నుంచి 300 మధ్య ఇళ్లను కేటాయిస్తూ, వీటన్నింటికీ హౌజ్ లిస్టింగ్ చేసుకునేందుకు వచ్చే నెల 9వ తేదీ వరకు గడువు విధించారు. కానీ ఎన్యుమరేటర్లు క్షేత్ర స్థాయికి వెళ్లిన తర్వాత ఒక్కో ఇంటి నెంబర్, ఒక్కో ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ పై ఒకటి కాకుండా కొన్ని భవనాల్లో మూడు నుంచి నాలుగు, మరి కొన్నింటిలో నాలుగు నుంచి ఆరు కుటుంబాలు నివసిస్తున్నందున, కుటుంబాల వారీగా హౌజ్ లిస్టింగ్ చేయాల్సి వస్తుందని కొందరు ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.

వచ్చే నెల 9 వరకు..

ఇండ్లు, కుటుంబాల సంఖ్య క్షేత్ర స్థాయిలో పెరగటంతో వచ్చే నెల 9 వరకు ఫిక్స్ చేసిన గడువును మరింత పెంచాల్సి వస్తుందని కొందరు ఎన్యుమరేటర్లు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలోని లోపాలను సరి చేసేందుకు నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు కేటాయించిన ప్రాంతాలపై వారికి ఏ మాత్రం అవగాహన లేకపోవటంతో వారు జీహెచ్ఎంసీ సిబ్బంది రాజకీయ నేతలపైనే ఆధారపడి విధులు నిర్వర్తించాల్సి వస్తుందని కొందరు బూత్ లెవెల్ ఆఫీసర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: పెట్రోల్, ఎరువుల ధరలు పెంచేసి.. వడ్ల ధరలు మాత్రం పెంచరా.. కేంద్రం పై మంత్రి తుమ్మల ఫైర్!

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×