E-Paper
Advertisement

Telangana Identity: ఇడుపు కాగితం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు: కల్వకుంట్ల కవిత!

Telangana Identity: ఇడుపు కాగితం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు: కల్వకుంట్ల కవిత!
Advertisement

Telangana Identity: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లకు పాలుపోసి పెంచుతున్నది బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. అస్తిత్వంపై దాడి జరిగిన సరే బీఆర్ఎస్ మాట్లాడటం లేదన్నారు. ఆదివారం ఉప్పల్ పిస్తా హౌస్ చౌరస్తాలో పార్టీ జెండాను కవిత ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ తెలంగాణ అస్తిత్వంపై కుట్ర చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇడుపు కాగితం అర్థం పవన్ కళ్యాణ్ ను అడిగితే బాగా తెలుస్తుందని చెప్పారు. తెలంగాణపై ఎవరెవరో ఎన్ని మాటలు అంటున్న సరే బీఆర్ఎస్ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు.

జీవో విడుదల చేయాలని డిమాండ్..

తెలంగాణ పై ఇంతలా దాడి జరుగుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉందదన్నారు. బీజేపీ కూడా తెలంగాణ సమస్యలను పట్టించుకోదన్నారు. ఈ ప్రాంతం హక్కులు, అస్తిత్వంపై టీఆర్ఎస్ మాత్రమే పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణలోని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, విద్యాసంస్థలకు ప్రభుత్వ డెయిరీ సంస్థల నుంచి పాలు సప్లయ్ అయ్యేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయా సంస్థల్లో ధోబీలు, హెయిర్ కంటింగ్, ఫర్నీచర్ సప్లయ్, టీచర్లు, ఇతర సిబ్బంది నియామాకంలో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Also read: Rowdy Sheeters: గ్రేటర్‌ హైదరాబాద్‌లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?

ఇడుపు కాగితం అంటే అర్థం పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు

ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ విషయంలో తెలంగాణ బాషను, యాసను ట్రోల్ చేస్తున్న వ్యవహారంపై కవిత స్పందించారు. ఇడుపు కాగితం అనే పదానికి అర్థం పవన్ కళ్యాణ్ అయితే బాగా చెబుతాడని చురకలంటించారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించేలా ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన బాష, యాసపై దాడి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఒకసారి అలా అవహేళన చేసినందుకే తెలంగాణ తెచ్చుకున్నామని…మళ్లీ అదే విధంగా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ బాషను మేము, మా బాషను మీరు గౌరవించుకుంటూ ఎవరికీ వారు బతుకుదామని సూచించారు.

జులై 2 న పెద్ద ఎత్తున భూపోరాటం

Advertisement

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం కోసం పెద్ద ఎత్తున భూపోరాటానికి తెలంగాణ రక్షణ సేన సిద్ధమైందని కవిత చెప్పారు. జులై 2 న ఉప్పల్ భగాయల్ లో ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారమన్నారు. ఈ భూపోరాటానికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులు, తెలంగాణ పౌరులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉద్యమకారులు, విద్యార్థులు, మహిళల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని చెప్పారు. ఉద్యమకారులపై లాఠీ, రబ్బరు తూటాలు పడాలంటే ముందు నన్ను దాటుకోని వెళ్లాలని కవిత అన్నారు. తెలంగాణలో హక్కులు, అస్తిత్వం కోసం తెలంగాణ రక్షణ సేన మాత్రమే ముందుండి కొట్లాడుతుందని చెప్పారు.

Also read: అమరావతి పేరుతో చంద్రబాబు భారీ దోపిడీ.. రూ.47 వేల కోట్ల అప్పు ఎందుకు?- అంబటి రాంబాబు

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

ఆ ఛాంబర్ ముందు ఆంక్షలు ఎందుకు.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్!

Big Stories

Advertisement
×