E-Paper
Advertisement

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!
Advertisement

Khelo India: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఆతిథ్యానికి, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్ఠకు తగిన స్థాయిలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. క్రీడా వేదికల సిద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారుల వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

డిసెంబర్ 11 నుంచి..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు తెలంగాణలో అత్యుత్తమ వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి క్రీడా వేదికలో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని, పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

క్రీడా సంస్కృతి..

Advertisement

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయ స్థాయి పోటీలు తెలంగాణలోని యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోని బాలదేవి, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also read: నేటికి ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు గుడ్‌ న్యూస్!

జంతు సంక్షేమం, ప్రజా భద్రతకు ప్రాధాన్యత..

Advertisement

తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు రెండో బోర్డు తొలి సమావేశం సోమవారంసచివాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగింది.సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాట్ల నివారణ, ప్రజా భద్రత, జంతు సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ఏబీసీరూల్స్–2023 అమలు, ఏబీసీ కేంద్రాల బలోపేతం, ప్రమాదకర కుక్కల నిర్వహణ, జంతు సంరక్షణ కేంద్రాలు, అత్యవసర పశువైద్య సేవలను మెరుగుపరచడంపై చర్చించారు.

మానవతా దృక్పథం..

చిన్నారులు, ప్రజలు, రహదారి భద్రతతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అదే సమయంలో జంతువుల పట్ల చట్టబద్ధమైన, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.పశుసంవర్ధక, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్యారోగ్య, విద్య, పోలీస్ శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో జయేష్ రంజన్, డా. కె. ఇలంబర్తి , డా. బి. గోపీ, ప్రొఫెసర్ జ్ఞానప్రకాశ్, దివ్య దేవరాజన్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్) క్షితిజ, కమిషనర్లు సృజన, కర్నన్, వినయ్ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Also read: నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

Tags

Related News

జూరాల రైతుల అరెస్టులపై హరీష్ రావు ఫైర్.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

అక్టోబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు.. ఎందుకో తెలుసా..?

గాంధీభవన్‌లో కేసీఆర్ అన్నకూతురు.. బీఆర్ఎస్‌లో రగులుతున్న కాక!

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Big Stories

Advertisement
×