E-Paper
Advertisement

పాస్‌పోర్ట్ ఉంటే భారతీయుడైనట్లేనా?.. ఒవైసీకి కిషన్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!

పాస్‌పోర్ట్ ఉంటే భారతీయుడైనట్లేనా?.. ఒవైసీకి కిషన్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పాస్‌పోర్ట్, పౌరసత్వ అంశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చట్టపరంగా ముమ్మాటికీ తప్పని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

చట్టాలపై అవగాహన లేకపోవడం విచారకరం

Advertisement

విదేశాల్లో బారిష్టర్ చదివిన అసదుద్దీన్ ఒవైసీ వంటి వ్యక్తికి భారతదేశ చట్టాల్లోని ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన లేకపోవడం విచారకరమని కిషన్ రెడ్డి చురకలంటించారు. ఒక ప్రజాప్రతినిధిగా, న్యాయశాస్త్రం తెలిసిన వ్యక్తిగా.. పాస్‌పోర్ట్‌కు, పౌరసత్వానికి మధ్య ఉన్న స్పష్టమైన చట్టపరమైన వ్యత్యాసాన్ని ఒవైసీ గ్రహించాల్సి ఉందన్నారు. ఒవైసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు చట్టంపై కనీస అవగాహన లేనట్లు కనిపిస్తోందని, లేదా రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్లో కావాలని గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Also Read: ఆర్‌ఎస్‌పీ ప్రాణాలకే ప్రమాదమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే

విదేశాంగ శాఖ స్పష్టం చేసిన అంశాలను కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాస్‌పోర్ట్ ఒక్కటే భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే తుది ఆధారం కాదని, అది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించే ఒక ‘ట్రావెల్ డాక్యుమెంట్’ మాత్రమేనని చట్టంలో స్పష్టంగా ఉందని వివరించారు. ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ ఆధారంగా దేశ పౌరసత్వాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో ఆందోళన వద్దు

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో కొనసాగుతున్న నాయకులు రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని కిషన్ రెడ్డి సూచించారు. ఇకనైనా ఒవైసీ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడానికి ముందే, ఆయన భారత పౌరసత్వ చట్టం (Citizenship Act), పాస్‌పోర్ట్ చట్టాలపై (Passports Act) పూర్తి అవగాహన పెంచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు.

Related News

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. అసలే ఏం జరిగింది? కుటుంబసభ్యుల ఆందోళన

నియోపోలిస్ ప్లాట్ 17 మళ్ళీ వేలం, చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్, అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ ధమాకా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం!

కేబీఆర్ పార్క్ వద్ద వన్-వే ట్రాఫిక్.. వాహనదారులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

మిస్సింగ్ కేసుల్లో ఇకపై ఆటలు సాగవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ఆస్పత్రి ఖర్చులకు భయపడక్కర్లేదు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Big Stories

Advertisement
×