MP Arvind: బీజేపీలో బీజేపీలో ఫైర్‌బ్రాండు నేతలకు కాలం చెల్లిందా? సైలెంట్‌గా ఉన్నవారికే పదవులా? మోదీ కేబినెట్ మొదలు.. తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక వరకు అదే జరిగిందా? దీనిపై ఆ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మరో దశాబ్దం పాటు ఫైర్‌బ్రాండ్ నేతలకు కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
గట్టిగా మాట్లాడిన నేతలకు అధిక ప్రయార్టీ ఇచ్చేవి రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో అధిష్టానం వద్ద పట్టుబట్టి టికెట్లు తెచ్చుకునేవారు. ఇదంతా ఒకప్పటి మాట.. మనుషులు మారారు. కాలంతోపాటు రాజకీయాల్లో ట్రెండ్ మారింది. సైలెంట్‌గా ఉన్న నేతలకు పగ్గాలు అప్పగిస్తున్నాయి పార్టీలు. ఈ విషయంలో బీజేపీ ఒక అడుగు ముందు ఉందనే చెప్పవచ్చు.
బీజేపీ రూటు మార్చింది. సంప్రదాయ రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చింది. ఫైర్‌బ్రాండ్ నేతలను దూరంగా పెడుతోంది. సైలెంట్‌గా ఉన్న నేతలకు పగ్గాలు అప్పగిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా ముఖ్యమంత్రుల ఎంపికలో అదే విధానం పాటించింది.. కంటిన్యూ చేస్తోంది. పార్టీని నమ్ముకున్నవారికి ఛాన్స్ వస్తుందని బయటకు చెప్పినా లోపల కథ వేరేగా ఉందట.
తెలుగు రాష్ట్రాలకు కొత్తగా అధ్యక్షులను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. అక్కడే కూడా ఇదే పద్దతిని పాటించింది. ఇక తెలంగాణ విషయానికొద్దాం. అధ్యక్షుడి రేసులో చివరకు ఇద్దరు నేతలు మిగిలారు. వారిద్దరూ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలే. అధ్యక్షుడి పీఠం తమకే దక్కుతుందని చివరకు ఆశ పడ్డారు. వారికి నిరాశే ఎదురైంది. హైకమాండ్ నిర్ణయం తీసుకోవడంతో నేతలు సైలెంట్ అయ్యారు.
ALSO READ: బయటికి రావద్దు.. ఈ రాత్రికి వాన దంచుడే దంచుడు
తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు ఎంపికయ్యారు. పార్టీ ఆఫీసులో ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఓ ట్వీట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల మంగళవారం రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేనని రాసుకొచ్చారు. దీని గురించి పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారని అంటున్నారు. మరో ఎంపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. నామినేషన్ల రోజు నుంచి ఇప్పటివరకు ఆయన కూడా అలకబూనుతారా? అనేది చూడాలి. ప్రస్తుత పరిణామాలను గమనించినవారు ఆ నేతలిద్దరు గుర్రుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 1, 2025