BigTV English

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసినట్టు పేర్కొంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. క్యుమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. గురువారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.


మరో రెండు రోజులు వర్షాలే.. వర్షాలు..
శుక్ర, శనివారాల్లో యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది వాతావరణ శాఖ. గడిచిన 24గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, వరంగల్‌, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.. సాయంత్రం వర్షం పడుతుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


Also Read: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. GHMC, పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా విభాగాల అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు సీఎం. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×