E-Paper
Advertisement

సర్కారు భూములకు ఫుల్ డిమాండ్.. ఓక్కరోజులోనే రూ.83 కోట్ల ఆదాయం!

సర్కారు భూములకు ఫుల్ డిమాండ్.. ఓక్కరోజులోనే రూ.83 కోట్ల ఆదాయం!
Advertisement

Open Plots: స్వేచ్ఛ బ్యూరో: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ తో ఫ్యూచర్ సిటీకి, అవుటర్ రింగ్ రోడ్ కు సమీపంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్ గుడ (11), బహదూర్ పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. పెద్ద అంబర్ పేట లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొన్నబిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి గౌతం తెలిపారు.

తొర్రూర్‌లో చదరపు గజం రూ.45.50 వేలు

తొర్రూల్ లే అవుట్ లో ప్లాట్ ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీలు పడుతూ గరిష్టంగా చదరపు గజం స్థలాన్ని రూ.45,500 (నలభైఐదు వేల అయిదు వందలు)కు వేలం పాటలో కొనుగోలు చేశారని ఎండి గౌతం తెలిపారు. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటి క్యారిడార్ కు సమీపంలో ఉన్న తొర్రూర్ లో 200 -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర 25 వేల రూపాయలుగా నిర్దారించగా, సగటున రూ. 32,500 (ముప్పయి రెండు వేల అయిదు వందలు) ధర పలికిందన్నారు. తమకు నచ్చిన భూముల కోసం పోటీ పడుతూ బిడ్డర్లు ఒక దశలో ప్లాట్ ను దక్కించుకోడానికి దాదాపు ఇరవైసార్లు రేట్లు పెంచారంటే ఇక్కడి భూములకున్న డిమాండ్ అర్ధంచేసుకోవచ్చు.

Advertisement

Also Read: పంటి నొప్పితో నరకం చూస్తున్నారా? నిమిషాల్లో తగ్గించే చిట్కాలు ఇవే!

గజం కనీస ధర..

అదే విధంగా ఎయిర్ పోర్టు, ఆర్సీఐకి దగ్గర్లో ఉన్న కుర్మల్ గుడలో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు చదరపు గజం కనీస ధర 20 వేల రూపాయలుగా నిర్ణయించగా, గరిష్టంగా రూ.27,500 ధర పలికింది. అవుటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని ఉన్న బహదూర్ పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు కూడా మంచి ధర పలికింది. ఇక్కడ చదరపు గజం కనీస ధర 27 వేల రూపాయలుగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ.40,500 (నలభైవేలు ఐదు వందల) రూపాయల ధర పలికింది. వేలం పాటలో సగటున ఈ భూములకు గజం రూ.33,800కు కొనుగోలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ బహిరంగ వేలం విక్రయాల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.

Advertisement

Also Read: బండి బగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తల్లి లేఖ వెనుక సంచలనాలు.. ఇరుకుంటున్న పెద్దలు

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×