Madiga Families: సిద్దిపేట నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా జీవిస్తున్న 40 మాదిగ కుటుంబాల నేడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసారు. దీంతో మాదిగల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. హరీష్ రావు తమకు అన్యాయం చేశారని మాదిగ కుటుంబాల ఆరోపణలు చేసారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి గ్రామంలో మాదిగల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పరిధిలోకి వచ్చిన చెల్కలపల్లి మాదిగవాడ మాదిగ రైతుల భూములకు నష్టపరిహారం ఇచ్చారని వెల్లడించారు.
ఇళ్లకు నష్టపరిహారం నిర్ణయించినా.. డబ్బులు ఇవ్వలేదని బాధితుల ఆరోపణలు చేశారు. రిజర్వాయర్ కారణంగా ఇళ్లలోకి నీళ్లు, పాములు వస్తున్నాయని మాదిగల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్కలపల్లి రికార్డుల నుంచి తమ పేర్లు తొలగించారని బాధితుల ఆరోపణలు చేశారు. గ్రామంలో నివాసం ఉంటున్నా.. రెవెన్యూ రికార్డుల్లో మా అడ్రస్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోనే ప్రస్తుతం నివాసం ఉంటున్నామని, ప్రత్యామ్నాయంగా ఇండ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాదిగల డిమాండ్ చేస్తున్నారు. గతంలో సలాంధ్ర గ్రామంలో ఇండ్ల స్థలాలు చూపించారని వెల్లడించారు. తమకు స్థలాలు కేటాయించకుండా మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు మాదిగలు ఆరోపనలు చేశారు.
Also read: డ్రైవర్ అవసరం లేదు.. గంటకు 90 కి.మీ వేగం.. కొత్త మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!
అల్లిపూర్ రెవెన్యూ పరిధిలోని ఎల్లయ్యపల్లి గ్రామంలో 16 మందికి 16 ఎకరాల పట్టాలు ఇచ్చారని, పట్టా భూముల్లో సాగు చేసుకునేందుకు వెళ్లగా దాడి చేశారని మాదిగ రైతుల ఆరోపణలు చేశారు. హరీష్ రావు అనుచరులే తమపై దాడి చేశారని బాధితుల ఆరోపణలు చేశారు. చెల్కలపల్లి మాదిగ కుటుంబాలకు ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లయ్యపల్లి సర్వే నంబర్లు 889, 1111లో ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు కేటాయించి వ్యవసాయం చేసుకుంటూ జీవించే అవకాశం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ ని మాదిగ కుటుంబాలు కోరారు.
Also read: యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!