E-Paper
Advertisement

Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!

Police Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Police Recruitment: స్వేచ్ఛ బ్యూరో: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి ప్రజా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ క్లియరెన్స్ ఇచ్చేసింది. మొత్తం 7,437 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. మూడు రోజుల క్రితమే 5,000 పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఓకే చెప్పగా, ఇప్పుడు అదనంగా మరో 2,437 పోస్టులను యాడ్ చేస్తూ మొత్తం ఖాళీల సంఖ్యను 7,437కు పెంచింది.

5,000 పోస్టులు భర్తీ..

మెగా రిక్రూట్‌మెంట్‌లో కేవలం పోలీస్ శాఖ మాత్రమే కాకుండా ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి నాలుగు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగానికి ఎన్ని పోస్టులు అనే వివరాలు గమనిస్తే.. పోలీస్ శాఖ (జీవో నంబర్ 78)లో అత్యధికంగా 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (జీవో నంబర్ 84): సెక్యూరిటీ విభాగంలో 1,424 పోస్టులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ (జీవో నంబర్ 80) డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్నిమాపక శాఖలో 790 పోస్టులు భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖ (జీవో నంబర్ 83) 223 ఖాళీలు భర్తీ చేస్తారు. అభ్యర్థులు గందరగోళ పడకుండా ఏయే విభాగంలో ఏయే పోస్టులు ఉన్నాయో బోర్డు క్లియర్‌గా అనౌన్స్ చేసింది.

Advertisement

Also read: హైదరాబాద్‌లో ‘సర్’ అస్తవ్యస్తం.. పది రోజులు గడిచినా అందని ఓటరు ఫారాలు!

వివరాలిలా..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ కానిస్టేబుల్స్ అత్యధికంగా 3,697 పోస్టులు ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్స్ 1,052 ఉన్నాయి. అలాగే సివిల్ సబ్ ఇన్‌ స్పెక్టర్ పోస్టులు 148 ఉన్నాయి. వీటికి తోడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్పీబీ) 23, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) 14, రిజర్వ్ సబ్ ఇన్‌ స్పెక్టర్ (టీజీఎస్పీ) 12 ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ (పీటీఓ) 20, మెకానిక్ (పీటీఓ) 7, కానిస్టేబుల్ (ఎస్ఏఆర్సీపీఎల్) 24, రిజర్వ్ సబ్ ఇన్‌ స్పెక్టర్ (ఎస్ఏఆర్సీపీఎల్) 3 పోస్టులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. మిగిలిన శాఖల విషయానికి వస్తే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్స్ 1,380, సబ్ ఇన్‌ స్పెక్టర్స్ 44 ఉన్నాయి. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ ఫైటర్స్ 751, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 39 పోస్టులు భర్తీ కానున్నాయి. అటు జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ (మెన్) 14, డిప్యూటీ జైలర్ (వుమెన్) 1, వార్డర్ (మెన్) 196, వార్డర్ (వుమెన్) 12 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

వెబ్‌సైట్‌లో..

Advertisement

ప్రస్తుతానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రెడీగా ఉందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది. అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపై బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆయా డిపార్ట్‌మెంట్ల హెడ్స్ నుంచి లోకల్ కేడర్ల వారీగా పోస్టుల డివిజన్, రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ లాంటి టెక్నికల్ డీటెయిల్స్ బోర్డుకు అందాల్సి ఉందన్నారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే, మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలతో అఫీషియల్ నోటిఫికేషన్లను వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు.

Also read: Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Related News

48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

Fertility Centres: కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పై సర్కార్ నయా స్కెచ్.. ఇకపై వరుస దాడులు..!

చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2026.. జులై 10 వరకు ఛాన్స్

Big Stories

Advertisement
×