BigTV English

Rythu Bharosa Scheme: ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ సాయం.. అకౌంట్ చెక్ చేసుకోవచ్చు

Rythu Bharosa Scheme: ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ సాయం.. అకౌంట్ చెక్ చేసుకోవచ్చు

Rythu Bharosa Scheme: తెలంగాణలో అన్నదాతలకు తీపి కబురు.  చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతు భరోసా కింద సాయం అందిస్తుంది. జూన్ 16 నుంచి 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేశారు.


వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గతేడాది రైతుల సంక్షేమం కోసం 78 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12 వేలు చొప్పున ఇవ్వనుంది. ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.


ఖరీఫ్, రబీ సీజన్లకు మాత్రమే. జూన్ 16 నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేయనుంది. తొలుత ఎకరం భూమి ఉన్న రైతులకు సంబంధించిన ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత రెండు ఎకరాలు, మూడు ఎకరాలు, నాలుగు ఎకరాలు ఇలా పెంచుకుంటూ నిధులను జమ చేయనున్నారు.

ALSO READ: ఘనంగా డిగ్రీ కళాశాల కొత్త బ్రాంచ్ ప్రారంభం

గతంలో మూడున్నర ఎకరాల భూమి కలిగిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. ఈసారి నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. 10 ఎకరాల వరకు డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు ఈ నెల చివరిలో నిధులు జమకానున్నాయి. అర్హత పొందిన రైతుల పేర్లను ఈ జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.

రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి పంటల గురించి అడిగి తెలుసు కుంటారు. గతేడాది మార్చి నుంచి నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో ఆరున్నర లక్షల మంది రైతులు పాల్గొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉంది. సోమవారం మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయాలు కలగనున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి 1,500 మంది రైతులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం 1,600 రైతు వేదికల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×