BigTV English

High-speed Train: అమెరికా రైళ్ల కంటే మన వందే భారత్ బెటర్.. అక్కడి రైళ్ల స్పీడ్ ఎంతంటే?

High-speed Train: అమెరికా రైళ్ల కంటే మన వందే భారత్ బెటర్.. అక్కడి రైళ్ల స్పీడ్ ఎంతంటే?

American Railways: ప్రపంచలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశంగా అమెరికాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చైనా, రష్యా, ఇండియా, కెనడా దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుండగా, అమెరికాలో మాత్రం ఇప్పటికీ బుల్లెట్ రైలు లేవు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సుమరు 12 బిలియన్ డాలర్ల వ్యయంతో లాస్ వెగాస్ నుంచి లాస్ ఏంజిల్స్ శివారు వరకు హైస్పీడ్ రైల్వే కారిడార్ ను నిర్మిస్తోంది. ఈ రైలు డిసెంబర్ 2028లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  ఇది అమెరికాలో మొట్టమొదటి 186mph వేగంతో ప్రయణించే రైలు కాబోతోంది. అటు కాలిఫోర్నియాలో 128 బిలియన్ డాలర్లతో 220mph లైన్‌ ను నిర్మిస్తోంది. ఇది 2033లో అందుబాటులోకి వచ్చేలా ప్రయాణిళికలు సిద్ధం చేశారు. ఈ రైల్వే కారిడార్ అందుబాటులోకి వస్తే కేవలం మూడు గంటల్లోపు లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణించే అవకాశం ఉంటుంది.


త్వరలో ఆమ్ ట్రాక్ అసెలా రైళ్లు ప్రారంభం

ఇక హై స్పీడ్ రైల్ అలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిక్ హార్నిష్ కీలక విషయాలు వెల్లడించారు. బ్రైట్‌ లైన్ వెస్ట్ ఇతర హై స్పీడ్ ప్రాజెక్టులకు పునాదికాబోతుందన్నారు. అమెరికాలో హై స్పీడ్ రైలు కోసం కీలక ముందడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఆమ్‌ ట్రాక్ కు చెందిన 160mph అసెలా రైళ్లను త్వరలో ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో ప్రారంభం కానున్న ఈ రైళ్లు వాషింగ్టన్ D.C. నుంచి న్యూయార్క్ మీదుగా బోస్టన్ వరకు ఈశాన్య కారిడార్‌ కు సేవలు అందిస్తాయన్నారు. ఇప్పుడిప్పుడే ఈ రైల్వే కారిడార్ నిర్మించిన నేపథ్యంలో రైలు వేగం ఆయా ప్రదేశాల్లో మారుతూ ఉంటాయన్నారు. ఈ రైలు 110 నుంచి 150mph వేగాన్ని అందుకుంటుందన్నారు.


హైస్పీడ్ రైల్లో ఎన్నో ప్రత్యేకతలు

కొత్తగా అందుబాటులోకి వచ్చే అసెలా రైళ్లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆన్‌ బోర్డ్ కేఫ్ కార్లు, Wi-Fi, సీటు దగ్గర USB పోర్ట్‌లు, ప్లగ్ సాకెట్లు అందించనున్నారు. ఆమ్‌ట్రాక్ యాప్‌ని ఉపయోగించి ప్రయాణీకులు తమ సీట్లను మార్చుకోవడానికి అనుమతించే ఇంటరాక్టివ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉందన్నారు రిక్ హార్నిష్.

యూరప్ తో వెనుకబడిన అమెరికా

వాస్తవానికి యూరప్, చైనాతో పోల్చితే హైస్పీడ్ రైళ్ల విషయంలో అమెరికా వెనుబడి ఉంది. యూరోపియన్ యూనియన్ 5,316 మైళ్ల పరిధిలో హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది, చైనాలో 31,000 మైళ్లను మించి హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. జపాన్ లోన హైస్పీడ్ రైళ్లు ప్రజలకు సేవనలు అందిస్తున్నాయి. అయితే, అమెరికా హై-స్పీడ్ లైన్ ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు. ఎందుకంటే, ఇక్కడి ప్రజలకు ఎక్కువగా విమానాలు లేదంటే కార్ల ద్వారా ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రయాణిస్తుంటారు. రైళ్లలో ప్రయాణించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.

Read Also: రైల్వే కొత్త రూల్.. అలా చేశారంటే జరిమానా కట్టాల్సిందే!

Related News

Indian Railways: భవిష్యత్ రైలు ప్రయాణం ఇలాగేనా? ఫస్ట్ ప్రయోగంతోనే అదరగొట్టిన రైల్వే!

AP Airport: ఏపీలోని ఆ ఎయిర్ పోర్ట్ ఒక రికార్డ్.. అందరి చూపు అటువైపే!

Condor Airlines plane: విమానంలో మంటలు.. పేలిన ఇంజిన్, 273 మంది ప్రయాణికులు

Diwali Tickets Sold out: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే..

India’s Fastest Train: దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లు ఇవే, టాప్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Indian Railways: కార్గోపై రైల్వే స్పెషల్ ఫోకస్, గతిశక్తి రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×