Indian Railways: రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా మంచిర్యాలలో వందేభారత్ రైలు ఆగాలని కోరుకుంటున్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. కేంద్రం నిర్ణయం పట్ల ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు ప్రజా ప్రతినిధులు రైల్వేశాఖ అధికారులు, మంత్రికి విజ్ఞాపనలు చేశారు. తమ ప్రాంత ప్రజల డిమాండ్ ను వివరించారు. ఈ ప్రాంత ప్రజల కోరికను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే హాల్టింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
రైల్వే మంత్రికి మంచిర్యాల నాయకుల విజ్ఞప్తి
సికింద్రాబాద్– నాగ్ పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ వంశీతో పాటు జిల్లా బీజేపీ నాయకులు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు రైల్వే సహాయ మంత్రి వి.సోమన్నను కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆదాయపరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్ రైల్వే స్టేషన్ జాబితాలో 30వ స్థానంలో ఉందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క రైల్వే స్టేషన్ లో కూడా వందే భారత్ హాల్టింగ్ లేదన్నారు. రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య దూరం తక్కువగా ఉందని, మంచిర్యాల స్టేషన్ లో వందేభారత్ ను ఆపాలని కోరారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి రోజూ చాలా మంది వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్, నాగ్ పూర్ వెళ్తుంటారని చెప్పారు. మంచిర్యాలలో రైలు నిలిపితే రైల్వే సంస్థకు అధిక ఆదాయం వస్తుందని, అదే సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. అటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భక్తులు తిరుపతికి వెళ్తుంటారని, మంచిర్యా ల నుంచి తిరుపతికి రైలును నడపాలని కోరారు.
Read Also: ఇండియాలో ఇప్పటికీ ఆ రైల్వే లైన్ బ్రిటిషర్లదేనట, ఏటా రాయల్టీ కూడా కట్టించుకుంటున్నారు!
మంచిర్యాల ప్రజల సంతోషం
మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కోరికను పట్టించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తున్నారు. మంచిర్యాలలో త్వరలోనే వందే భారత్ ట్రైన్ ఆగుతుందన్నారు. సికింద్రాబాద్-నాగ్ పూర్ వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. ఏడాదిన్నరగా చేస్తున్న కృషికి కేంద్రం స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Read Also: 7 రూట్లలో రెట్టింపు కాబోతున్న వందేభారత్ కోచ్ లు, ఇదీ క్రేజీ న్యూస్ అంటే!