E-Paper
Advertisement

దేవుడి విగ్రహం పగలగొట్టి.. యముడికి ఛాలెంజ్, తర్వాతి రోజే ఘోర ప్రమాదం, చివరికి..

దేవుడి విగ్రహం పగలగొట్టి.. యముడికి ఛాలెంజ్, తర్వాతి రోజే ఘోర ప్రమాదం, చివరికి..
Advertisement

Chinese Influencer Jiang Xiaorou Death: జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పడం కష్టం. కనురెప్ప మూసి తెరిచే లోగా విధి ఎలాంటి వింత నాటకం ఆడుతుందో ఊహించలేం. చైనాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలోనూ అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగింది. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, మూఢనమ్మకాలు అసలే లేవు అంటూ వింత ప్రయోగాలతో సోషల్ మీడియాను ఊపేసిన 24 ఏళ్ల చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సర్  జీవితం అనూహ్య మలుపు తిరిగి, విషాదాంతంగా ముగిసింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

డోయిన్ (చైనీస్ టిక్‌టాక్) వేదికగా 1.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న జియాంగ్ జియాఓరూ (Jiang Xiaorou) కంటెంట్ అంటేనే ఒక సంచలనం! పాడుబడిన భవనాలు, నిర్మానుష్యమైన దారులు, అర్ధరాత్రి వేళల్లో దెయ్యాల వేట.. సమాజంలో నాటుకుపోయిన భయాలను, మూఢనమ్మకాలను సవాలు చేస్తూ ముందుకుసాగేది. అయితే, కొన్ని నెలల క్రితం ఆమె చేసిన ఒక సంచలన ప్రయోగం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఒక పవిత్రమైన విగ్రహాన్ని పగులగొడుతూ, “చూద్దాం… నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో!” అంటూ వ్యవస్థను, నమ్మకాలను సవాలు చేసింది. అంతేకాదు, కర్మ సిద్ధాంతాన్ని హేళన చేస్తూ, “రేపే నేను కార్ యాక్సిడెంట్‌లో చనిపోతానేమో చూడండి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

కాలం ఎంత విచిత్రమైనదో!

Advertisement

జియాంగ్..  జూలై 15న గువాంగ్జీ నుంచి గువాంగ్‌ జౌకు రైడ్ షేర్ వెహికల్ లో వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. తీవ్రమైన బ్రెయిన్ ఇంజ్యూరీ, విపరీతమైన రక్తస్రావంతో చావుబతుకుల మధ్య ఐసియులో చేరింది. ఆమెను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు, ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. కానీ, విధి కరుణించలేదు. దాదాపు నెల రోజుల పాటు ఐసియులో మరణంతో పోరాడిన జియాఓరూ, ఆగస్టు 10న శాశ్వతంగా కన్నుమూసింది.

జియా మరణంతో నెటిజన్లు షాక్!

Advertisement

జియా మరణ వార్తతో చైనా సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె గతంలో అన్న మాటలు, చేసిన వీడియోలు నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. “ఆమె చేసిన చేతలు, మాట్లాడిన మాటలే తనను బలితీసుకున్నాయా?” అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే, “ఇది కేవలం ప్రమాదం మాత్రమే.. దయచేసి అవాస్తవాలను, మూఢనమ్మకాలను ప్రచారం చేసి ఆమె ఆత్మను అవమానించకండి” అంటూ కుటుంబ సభ్యులు నెటిజన్లను వేడుకుంటున్నారు. ప్రకృతిని, సమయాన్ని హేళనగా చూడకూడదనే విధి పాఠమో, లేక అనుకోకుండా జరిగిన దురదృష్టమో గానీ.. 24 ఏళ్ల జియా జీవితం  హఠాత్తుగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.

Read Also: జస్ట్ 5 సెకన్లలో 800 కిమీ వేగం.. ఫ్యూచర్ బుల్లెట్ రైలు ఇదేనా?

Tags

Related News

దోశను స్పూన్‌తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!

భోగాపురంలో దిగిన ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్‌కు ఘన స్వాగతం.. ఈ వీడియో చూశారా?

గాల్లోకి ఎగిరిన తొలి ఎలక్ట్రిక్ విమానం.. అరగంట పాటు ఆకాశంలో చక్కర్లు!

‘పెద్ది’ సినిమాలో రైలు వెనుక ఇంత కథ ఉందా? అసలు ఆ ట్రైన్ ఇండియన్ రైల్వేది కాదా?

విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. రూట్లు, ఛార్జీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు!

చర్లపల్లి–గోరఖ్‌ పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్.. అక్టోబర్ 2 నుంచి రాకపోకలు షురూ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!

Big Stories

Advertisement
×