Ganesh Chaturthi 2025: మరికొద్ది రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం 380 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇన్ని ప్రత్యేక రైళ్లను నడపలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రజలకు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
వినాయక చవితికి ప్రతి ఏటా పెరుగుతున్న ప్రత్యేక రైళ్లు
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచుతుంది. భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటుంది. 2023లో గణేష్ పండుగకు 305 ప్రత్యేక రైళ్లను నడిపింది. 2024కు వచ్చే సరికి ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్య 358కి పెరిగింది. ఇక 2025లో రికార్డు స్థాయిలో ఏకంగా 380 రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతంపై ఎక్కువ ఫోకస్
నిజానికి గణపతి ప్రత్యేక రైళ్లను ఎక్కువగా సెంట్రల్ రైల్వే పరిధిలో నడిపిస్తున్నారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతంలో అత్యధికంగా 296 సర్వీసులను అందుబాటులో ఉంచారు. ఇక్కడి ప్రజలు గణేష్ పండుగను మరింత ఘనంగా జరుపుకుంటారు. పశ్చిమ రైల్వే పరిధిలో 56 రైళ్లు, కొంకణ్ రైల్వే పరిధిలో 6 రైళ్లు, సౌత్ వెస్ట్రన్ రైల్వే 22 ట్రిప్పులు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రధానంగా కొంగణ్ ప్రాంతానికి వెళ్లే భక్తులకు కోసం ఈ రైళ్లను ఎక్కువగా అందుబాటులో ఉంచారు.
Indian Railways is set to join the festive spirit of Ganesh Chaturthi by operating 380+ train trips. pic.twitter.com/DjLs4CIfzR
— Ministry of Railways (@RailMinIndia) August 23, 2025
కొంకణ్ ప్రాంతంలో ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు
గణేష్ స్పెషల్ ట్రైన్లు కొంకణ్ ప్రాంతంలో పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ మార్గంలో వీలైనంత వరకు అన్ని స్టేషన్లలో హాల్టింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.చిప్లూన్, రత్నగిరి, కంకవలి, సింధుదుర్గ్, కుడల్, సావంత్‌వాడి, మడగావ్, కర్వార్, ఉడుపి, ముర్దేశ్వర్, కుందాపుర, సురత్కల్ స్టేషన్లలో ప్రత్యేక రైళ్లు ఆగుతాయి. వీటితో పాటు కొంకణ్ రైల్వే మార్గంలోని మరికొన్ని స్టేషన్లలోనూ ఆపనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి ఆ రైళ్లు బంద్, ఎందుకంటే?
ఆగష్టు 27 నుంచి వినాయ నవరాత్రి ఉత్సాలు
ఇక ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగ దగ్గరికి వస్తున్న కొద్దీ ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. ప్రయాణీకులు ఎప్పుడు వెళ్లాలనుకున్న ఇబ్బంది లేకుండా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను ఆయా రైల్వే డివిజన్లు ప్రకటించాయి. ప్రయాణీకులు ఈ రైళ్లకు సంబంధించిన షెడ్యూల్, టైమింగ్స్, హాల్టింగ్ వివరాలను భారతీయ రైల్వే వెబ్ సైట్, యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు.
Read Also: పండుగకు వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!