IndiGo Monsoon Sale 2025: ఈ వర్షాకాలంలో వెకేషన్ ప్లాన్ చేసే వారికి ఇండిగో సూపర్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ మాన్ సూన్ సేల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమానా ప్రయాణాలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 24 నుంచి 29 మధ్య చేసిన బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
రూ. 1,499కి దేశీయ, రూ. 4,399కి విదేశీ ప్రయాణం
దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు కేవలం రూ. 1,499కే టికెట్ అందిస్తోంది. టికెట్ ద్వారా వన్ వే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించి, దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ లాంటి గమ్యస్థానాలకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. విదేశీ ప్రయాణ ఛార్జీలు రూ. 4,399 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ సరసమైన ధరలు హాలీ డే ఎంజాయ్ చేయాలనుకునే వారికి, డబ్బులు ఆదా చేయాలనుకునే ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటాయి.
అదనపు ఛార్జీలు లేకుండా అదనపు సౌకర్యం
విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఇండిగో తన ప్రీమియం ఇండిగోస్ట్రెచ్ సీటింగ్ ను అందిస్తోంది. ఈ సర్వీసులో అదనపు లెగ్ రూమ్ ఉంటుంది. రూ. 9,999 నుండి ప్రారంభమయ్యే ఎంపిక చేసిన మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రీమియం రేట్ ట్యాగ్ లేకుండా అప్ గ్రేడ్ చేసిన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
విమాన ఛార్జీల యాడ్ ఆన్ లపై మరింత ఆదా!
డిస్కౌంట్ టికెట్లతో పాటు, ఇండిగో ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 50% వరకు తగ్గింపును అందిస్తోంది. దేశీయ విమానాలకు కేజీకి రూ. 1,000 ధర ఉంది. సీట్ల ఎంపిక కూడా చౌకగా ఉంటుంది. బేసిక్ సీట్లు రూ. 99 నుంచి ప్రారంభం అవుతాయి. అదనపు లెగ్ రూమ్ తో XL సీట్లు రూ. 500 నుంచి అందుబాటులో ఉంటాయి. చెక్ ఇన్, బోర్డింగ్ ను వేగవంతం చేయడానికి ప్రయాణీకులు ఫాస్ట్ ఫార్వర్డ్ సేవలను కూడా బుక్ చేసుకోవచ్చు.
టికెట్ క్యాన్సిలేషన్ కూడా మరింత ఈజీ!
వర్షాల కారణంగా ప్రయాణ ప్రణాళికలు మారితే ఈజీగా టికెట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. జీరో క్యాన్సిలేషన్ యాడ్-ఆన్ అందిస్తోంది. కేవలం రూ. 299 తో ప్రయాణీకులు ఎటువంటి అదనపు రుసుములు చెల్లించకుండా తమ బుకింగ్ ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండిగో 6E ప్రైమ్, సీట్ & ఈట్ లాంటి బండిల్ డీల్‌లపై 30% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ప్యాకేజీలలో చెక్ ఇన్ లో ప్రాధాన్యత, అదనపు లగేజీ, విమానంలో భోజనం లాంటి అదనపు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇండిగో మాన్ సూన్ సేల్ 2025 వర్షాకాలంలో కొత్త ప్రాంతాలకు వెళ్లాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. బెస్ట్ డీల్‌లను పొందడానికి ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం బెస్ట్.
Read Also: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!