E-Paper
Advertisement

ఒమాన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? 14 రోజుల టూరిస్ట్ వీసా ఉచితం.. కానీ ఈ కండీషన్స్

ఒమాన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? 14 రోజుల టూరిస్ట్ వీసా ఉచితం.. కానీ ఈ కండీషన్స్
Advertisement

Oman Free Visa| ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఒమాన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు 14 రోజుల పాటు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వీసాకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో తక్కువ కాలం టూర్ ప్లాన్ చేసేవారికి ఇది మంచి అవకాశం కానుంది. అయితే ఈ ఉచిత వీసాకు కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ఒమాన్ అధికారిక గెజిట్‌లో 2026 ఆగస్టు 2న ప్రచురించారు. 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చింది.

ఉచిత వీసాకు ఎవరు అర్హులు?

ఈ 14 రోజుల ఉచిత టూరిస్ట్ వీసా అందరికీ వర్తించదు. ఒమాన్ ప్రభుత్వం ఎంపిక చేసిన దేశాల పౌరులు మాత్రమే ఈ వీసా పొందగలరు. అయితే, ఇప్పటివరకు అర్హత పొందిన దేశాల పూర్తి జాబితాను ప్రభుత్వం విడుదల చేయలేదు. అందువల్ల ఏ దేశాల పౌరులకు ఈ సౌకర్యం వర్తిస్తుందో తెలుసుకోవడానికి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

ఈ వీసా ప్రత్యేకత ఏమిటి?

Advertisement

ఈ వీసా ద్వారా అర్హులైన ప్రయాణికులు 14 రోజుల పాటు ఒమాన్‌లో ఎలాంటి వీసా ఫీజు లేకుండా ఉండవచ్చు. దీంతో చిన్న విహారయాత్రలు, కుటుంబంతో సెలవులు లేదా వారాంతపు పర్యటనలు మరింత సులభంగా మారనున్నాయి. వీసా ఖర్చు లేకపోవడం వల్ల పర్యాటకులకు అదనపు ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ నిర్ణయం ద్వారా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఒమాన్ ప్రభుత్వం భావిస్తోంది.

ఎక్కువ రోజులు ఉండాలంటే?

14 రోజుల ఉచిత వీసాతో ఒమాన్‌కు వెళ్లిన తర్వాత మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని అనుకుంటే అవకాశం ఉంది. వీసా గడువు ముగిసేలోపు మరో టూరిస్ట్ వీసాగా మార్చుకోవచ్చు. అయితే, కొత్త వీసాకు సంబంధించిన అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఆ రెండో టూరిస్ట్ వీసాకు నిర్ణయించిన ఫీజు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

ఒమాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

Advertisement

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒమాన్ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. తక్కువ రోజుల ప్రయాణాలను ప్రోత్సహించడం ద్వారా విదేశీ సందర్శకులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయానికి ఒమాన్ పోలీస్ అండ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హసన్ బిన్ మొహ్సిన్ అల్ షురైఖీ ఆమోదం తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి అనుమతి ఇచ్చింది.

Also Read: కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

భారతీయులు తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి ఒమాన్ వెళ్లడానికి వీసా తప్పనిసరి. కొత్త ఉచిత 14 రోజుల వీసాకు భారత్ అర్హత పొందిన దేశాల జాబితాలో ఉందని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
అందువల్ల భారతీయులు ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా నిబంధనలనే పాటించాలి.
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయులకు మాత్రం 14 రోజుల వీసా ఆన్ అరైవల్ లభించే అవకాశం ఉంది.
ఈ పత్రాలు లేని వారు ప్రయాణానికి ముందు ఒమాన్ ఈ – వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: ఐఐటీ డిగ్రీ లేకుండానే నెలకు రూ.5 లక్షల ఆదాయం? బీటెక్ డ్రాప్‌అవుట్ సంపాదన ఎలాగంటే

అధికారిక జాబితా కోసం మరి కొంత కాలం వేచి ఉండాలి

ఉచిత 14 రోజుల టూరిస్ట్ వీసా పర్యాటకులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. అయితే అర్హత పొందిన దేశాల పూర్తి జాబితాను ఒమాన్ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి భారతీయులు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించడం మంచిది.

Tags

Related News

ఒక రైల్ ఇంజిన్ ఎన్ని బోగీలను లాగగలదు.. రైల్వే బోగీల సంఖ్య ఎందుకు పెంచదు?

పండగకు ఊరెళ్లేవారికి సూపర్ న్యూస్.. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ రైళ్లు!

సికింద్రాబాద్–వరంగల్ మార్గంలో నాలుగు రైళ్లు రద్దు, ఎప్పుడంటే?

రైలు 9 గంటలు లేట్.. ప్రయాణికుడికి రూ.35 వేల పరిహారం.. అసలు ఏం జరిగిందంటే?

20 గంటల ప్రయాణం ఇక 7 గంటలే.. మరో బుల్లెట్ రైలు కారిడార్ కు గ్రీన్ సిగ్నల్!

రూ.50,000 బడ్జెట్‌లో ఫారిన్ టూర్.. ఫ్రెండ్స్‌తో కలిసి మలేషియా ట్రిప్ ఇలా ఎంజాయ్ చేయండి

తెలంగాణకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్ వచ్చేస్తోంది!

దీపావళికి ముందే రెండో వందే భారత్ స్లీపర్ ఎంట్రీ.. ఏ రూట్ లో పరుగులు తీస్తుందంటే?

Big Stories

Advertisement
×