బోయింగ్ 777-300ER ప్లాట్ ఫారమ్ ఆధారంగా రూపొందించబడిన ఎయిర్ ఇండియా వన్.. VVIP ఉపయోగం కోసం పూర్తిగా మోడీఫై చేయబడింది. వైడ్ బాడీ, లాంగ్-రేంజ్ విమానంగా రూపొందించబడింది. వైట్, ఆరెంజ్ కలర్ లివరీ, జాతీయ చిహ్నం కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ దిగినా చాలా హూందాగా కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి గల్ఫ్ స్ట్రీమ్ IV ఒక మధ్య తరహా బిజినెస్ జెట్. చూడ్డానికి చిన్నగా, ఇరుకుగా ఉంటుంది. ప్రైవేట్ ఎగ్జిక్యూటివ్ విమానాన్ని పోలి ఉంటుంది. ఇది అంతగా రాయల్ లుక్ ను కలిగి ఉండదు.
ఎయిర్ ఇండియా వన్ కోసం ఉపయోగించే బోయింగ్ 777ను అమెరికాలో బోయింగ్ కంపెనీ నిర్మించింది. భద్రత, దౌత్య అవసరాలను అనుగుణంగా దీనిని పూర్తి స్థాయిలో మోడీఫై చేశారు. ఈ విమానంలో రీన్ఫోర్స్డ్ నిర్మాణాలు, ప్రత్యేక ఏవియానిక్స్, సేఫ్ కమ్యూనికేషన్ సూట్లు ఉన్నాయి. ఇవి ప్రధాన మంత్రి విమానంలో సజావుగా పని చేయడానికి వీలు కల్పిస్తాయి. గల్ఫ్ స్ట్రీమ్ జెట్ ను ఏరోస్పేస్ తయారు చేసింది. దీనిని లగ్జరీ బిజినెస్ జెట్ గా రూపొందించింది. ఇది అధిక భద్రత కంటే సౌకర్య ఆధారిత వ్యాపార వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.
ఎయిర్ ఇండియా వన్ ను తరచుగా ఫ్లయింగ్ ఫోర్ట్రెస్ గా అభివర్ణిస్తారు. రక్షణ సామర్థ్యం పరంగా అమెరికన్ అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ తో పోటీపడుతుంది. ఇది అధునాతన క్షిపణి-రక్షణ వ్యవస్థలు, రాడార్ జామర్లు, గాలిలో ముప్పును తిప్పికొట్టగల, తటస్థీకరించగల ఎలక్ట్రానిక్ వ్యవస్థను కలిగి ఉంది. ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, శాటిలైట్ కనెక్టివిటీ జెట్ ను ఎయిర్ బోర్న్ కమాండ్ సెంటర్ గా మారుస్తాయి. ప్రధానమంత్రి ప్రయాణ సమయంలోనూ ఆదేశాలు జారీ చేయడానికి, సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. అటు గల్ఫ్ స్ట్రీమ్ IV బిజినెస్ జెట్ బేసిక్ భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది భారత ప్రధాని ప్రయాణించే విమానం మాదిరిగా లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ బోర్న్ కమాండ్ సామర్థ్యాలను కలిగి ఉండదు.
సామర్థ్యం పరంగా, ఎయిర్ ఇండియా వన్ ప్రపంచంలోనే టాప్ రేంజ్ లో ఉంటుంది. బోయింగ్ 777 సాధారణంగా 300 మంది ప్రయాణీకులను తీసుకెళ్తుంది. కానీ, VVIP కాన్ఫిగరేషన్ కారణంగా ప్రధానమంత్రి, సీనియర్ అధికారులు, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బందిని తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇందులో లగ్జరీ సూట్లు, ప్రత్యేక వైద్య కేంద్రం, సేఫ్ మీటింగ్ హాల్స్, సిబ్బంది, ప్రతినిధుల కోసం పలు క్యాబిన్ విభాగాలు ఉంటాయి. ఇక గల్ఫ్ స్ట్రీమ్ IV తక్కువ మంది కోసం రూపొందించబడింది. ఇందులో సాధారణంగా 14 నుంచి 18 మంది మధ్య కూర్చుంటుంది. దీని లోపలి భాగాలు మెత్తగా, చక్కగా అమర్చబడి, సౌకర్యవంతమైన సీటింగ్, మీటింగ్ టేబుళ్లతో ఉంటాయి.
ఎయిర్ ఇండియా వన్ దాదాపు 13,650 కిలోమీటర్ల గరిష్ట పరిధిని కలిగి ఉంటుంది. ఇది భారత్ నుంచి అమెరికా లేదంటే యూరప్‌కు ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. గల్ఫ్ స్ట్రీమ్ IV గరిష్ట పరిధి 8,000 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఎయిర్ ఇండియా వన్ తో పోల్చితే సగం రేంజ్ ను కలిగి ఉంటుంది.
Read Also: వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, ఫస్ట్ రూట్ ఇదే!