India Railway: భారతీయ రైల్వేకు కొత్త జవసత్వాలు తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ త్వరలో అప్ గ్రేడ్ వెర్షన్ లో అందుబాటులోకి రానుంది. వందేభారత్ స్లీపర్ పేరుతో సుదూర ప్రయాణాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ఈ రైళ్లు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ప్రస్తుత వందేభారత్ రైళ్లతో పోల్చితే మరిన్ని ఫీచర్లను కలిగి ఉండబోతోంది. ప్రతి కోచ్ లో CCTV పర్యవేక్షణ, LED స్క్రీన్లు, ఆటోమేటిక్ డోర్లు, అగ్నిమాపక భద్రతా వ్యవస్థతో పాటు పలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంటుంది.
తొలి వందేభారత్ స్లీపర్ నడిచే రూట్ ఇదే!
ఇక తొలి వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి రూట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఈ రైలును నడపబోతున్నట్లు సమాచారం. ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మీదుగా వెళ్లనుంది. ప్రీమియం రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన సౌకర్యాలు, ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ రైలు దీపావళికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్లీపర్ వందే భారత్ అంచనా ఛార్జీ, షెడ్యూల్
వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ ధర రాజధాని ఎక్స్ ప్రెస్ కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రైలు గంటకు 180 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయింది. రైలు సెట్ ను నెక్ట్స్ పరీక్షల కోసం ఢిల్లీలోని షకర్ పూర్ షెడ్ కు తరలించారు. వందే భారత్ స్లీపర్ రైలు ఇది రాత్రి 8 గంటలకు పాట్నా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. రాజధాని ఢిల్లీ చేరుకోవడానికి 20.30 గంటలు పడుతుండగా, స్లీపర్ వందే భారత్ ఈ ప్రయాణాన్ని 11.40 గంటల్లో పూర్తి చేయనుంది.
భారతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా..
వందే భారత్ స్లీపర్ రైలు ఇంటీరియర్స్ భారతీయ ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. సాధారణంగా విమానాలు, స్టార్ హోటల్ గదులలో కనిపించే సౌకర్యాలను కలిగి ఉంటాయి.
Read Also: రైలు పట్టాల మీదే కరెంటు తయారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!
7 రూట్లలో వందేభారత్ రైళ్ల కోచ్ ల పెంపు
ఇక దేశంలో ఎక్కువ రద్దీ ఉన్న రూట్లలో నడుస్తున్న వందేభారత్ రైళ్లకు సంబంధించి రీసెంట్ గా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు అధిక రద్దీ మార్గాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అప్ గ్రేడ్ చేయాలని భావిస్తోంది. 8 కోచ్ లతో నడుస్తున్న రైళ్లను 16 కోచ్ లకు, 16 కోచ్ లతో నడుస్తున్న రైళ్లను 20 కోచ్ లకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ 7 మార్గాల్లో 8 కోచ్ లతో నాలుగు, 16 కోచ్ లతో మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.\
Read Also: పండుగ సీజన్ కోసం 150 ప్రత్యేక రైళ్లు, తెలుగు ప్రయాణీకులకు క్రేజీన్యూస్!