E-Paper
Advertisement

భోగాపురంలో దిగిన ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్‌కు ఘన స్వాగతం.. ఈ వీడియో చూశారా?

భోగాపురంలో దిగిన ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్‌కు ఘన స్వాగతం.. ఈ వీడియో చూశారా?
Advertisement

Bhogapuram Airport First Flight: ఆంధ్రప్రదేశ్‌ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్రకు సేవలందించిన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ముగిశాయి. అదే సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

విశాఖ నుంచి చివరి విమానం.. భోగాపురంలో తొలి విమానం

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి చివరి విమానం బయలుదేరింది. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి వెళ్లిన ఇండిగో విమానం చివరి సర్వీస్‌గా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా విశాఖకు విమాన ప్రయాణ సేవలు అందించిన ఈ విమానాశ్రయం నుంచి సాధారణ కమర్షియల్‌ సర్వీసులను ముగించింది. విశాఖ విమానాశ్రయం స్థానంలో  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన విమానయాన కేంద్రంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమాన సర్వీసు సోమవారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6E6408 ఉదయం 6.38 గంటలకు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది.

తొలి విమానానికి ఘన స్వాగతం

Advertisement

కొత్త విమానాశ్రయంలో దిగిన తొలి దేశీయ ప్రయాణికులకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. విమానం రన్‌వేపైకి వచ్చిన సమయంలో వాటర్‌ కెనాన్‌ సెల్యూట్‌ తో ప్రత్యేకంగా స్వాగతం చెప్పారు. అనంతరం ప్రయాణికులతో కేక్‌ కట్‌ చేయించి వేడుకలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర సంప్రదాయానికి ప్రతీకగా ఏటికొప్పాక బొమ్మలను కూడా ప్రయాణికులకు బహుమతిగా అందించారు.

సింగపూర్‌ నుంచి తొలి అంతర్జాతీయ విమానం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు కూడా ప్రారంభమయ్యాయి. సింగపూర్‌ నుంచి వచ్చిన స్కూట్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం కొత్త విమానాశ్రయంలో తొలి అంతర్జాతీయ కమర్షియల్‌ సర్వీస్‌గా నిలిచింది. సింగపూర్‌ నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. తొలి ఫ్లైట్ ప్రయాణికులకు సర్టిఫికెట్ అందజేశారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత అదే విమానం ప్రయాణికులతో తిరిగి సింగపూర్‌కు బయలుదేరింది. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విమానయాన సేవలకు కూడా శ్రీకారం చుట్టింది.

ఉత్తరాంధ్రకు మెరుగైన కనెక్టివిటీ

Advertisement

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో విమాన ప్రయాణ సౌకర్యాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిర్వహించేందుకు అనుగుణంగా రూపొందించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఉన్న కొన్ని పరిమితులకు ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ పనిచేయనుంది. కొత్త విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇతర నగరాలు, విదేశాలతో విమాన కనెక్టివిటీ మరింత పెరగనుంది.

పర్యాటకం, వ్యాపారానికి బూస్టింగ్

విమాన కనెక్టివిటీ పెరగడం వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులకు కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా  విశాఖ విమానాశ్రయం అధ్యాయం ముగియగా.. భోగాపురంలో కొత్త ప్రయాణం మొదలైంది. తొలి దేశీయ, అంతర్జాతీయ విమానాలతో ప్రారంభమైన ఈ కొత్త విమానాశ్రయం రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రకు కీలక రవాణా కేంద్రంగా ఎదగనుంది.

Read Also: గాల్లోకి ఎగిరిన తొలి ఎలక్ట్రిక్ విమానం.. అరగంట పాటు ఆకాశంలో చక్కర్లు!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×