E-Paper
Advertisement

రూమ్ ఫ్రెష్‌నర్స్ లేకున్నా.. హోటల్ బాత్‌రూమ్స్ చాలా ఫ్రెష్‌.. దీని వెనుక రహస్యం ఇదే!

రూమ్ ఫ్రెష్‌నర్స్ లేకున్నా.. హోటల్ బాత్‌రూమ్స్ చాలా ఫ్రెష్‌.. దీని వెనుక రహస్యం ఇదే!
Advertisement

Hotel Bathroom: ఏదైనా లగ్జరీ హోటల్ బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే ఒక రకమైన ఆహ్లాదకరమైన, సహజమైన తాజా సువాసన మనకు స్వాగతం పలుకుతుంది. సాధారణంగా ఇళ్లలో వాడే ఘాటైన పర్ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెష్‌నర్ల వాసన అక్కడ అస్సలు కనిపించదు. నిజానికి హోటళ్లు కృత్రిమ సువాసనలతో దుర్గంధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయవు. సైంటిఫిక్ పద్ధతులను అవలభించి.. ఆ దుర్వాసనలకు చెక్ పెడుతుంది. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.

రూమ్ ఫ్రెష్‌నర్లకు హోటళ్లు ఎందుకు దూరం?

వాణిజ్యపరంగా లభించే ఎయిర్ ఫ్రెష్‌నర్లు దుర్గంధాన్ని తొలగించవు కేవలం తాత్కాలికంగా కప్పిపుచ్చుతాయి. అంతేకాకుండా ఇవి గాలిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణమవ్వడమే కాకుండా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. అందుకే ప్రముఖ లగ్జరీ హోటళ్లలో చెడు వాసనలకు కారణమయ్యే తడి గుడ్డలు, నిలిచిపోయిన నీరు, గాలి ఆడకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికే ప్రాధాన్యం ఇస్తారు. కృత్రిమ సువాసనల కంటే సహజమైన పద్ధతుల్లో గాలి వెలుతురు వచ్చేలా బాత్రూమ్ లను డిజైన్ చేస్తారు.

బాత్‌రూమ్ దుర్గంధానికి కారణాలు

Advertisement

సాధారణంగా దుర్వాసనలు తొలగించాలంటే అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడం ముఖ్యం. బాత్‌రూమ్‌లలో ఎప్పుడూ ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా డ్రెయిన్ పైపులు, సింకుల్లో ‘బయోఫిల్మ్’ అనే సన్నని జిగట పొరలాంటిది ఏర్పడుతుంది. ఇది బ్యాక్టీరియా మనుగడకు స్థావరంగా మారి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను విడుదల చేస్తుంది. దీనివల్ల కుళ్లిన గుడ్ల వాసన వంటి అసహ్యకరమైన దుర్గంధం వస్తుంది. అలాగే బాత్రూమ్ కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు వేల సంఖ్యలో మైక్రోబ్స్ గాల్లోకి విడుదలవుతాయి. సరిగ్గా వెంటిలేషన్ లేకపోతే ఇవి గాలిలోనే ఉండిపోయి దుర్గంధాన్ని కలిగిస్తాయి. గదిలో తేమ శాతం 60 కంటే ఎక్కువైతే బ్యాక్టీరియా పెరుగుదల, వాసనల తీవ్రత రెట్టింపు అవుతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

వెంటిలేషన్ చాలా ముఖ్యం

హోటళ్లలో నిరంతరం పనిచేసే ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు బాత్‌రూమ్‌లోని తేమతో కూడిన గాలిని బయటకు పంపి, నిరంతరం తాజా గాలిని లోపలికి తీసుకొస్తాయి. గాలి నిరంతరం ఆడుతూ ఉండటం వల్ల ఎలాంటి కృత్రిమ పర్ఫ్యూమ్‌లు వాడాల్సిన అవసరం లేకుండానే బాత్‌రూమ్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది.

సహజమైన శుభ్రపరిచే పద్ధతులు

Advertisement

ఇదిలా ఉంటే హోటళ్లలో డ్రెయిన్లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా ఆమ్ల గుణాలను తగ్గిస్తే.. వెనిగర్ పైపుల్లో పేరుకుపోయిన ఆర్గానిక్ వ్యర్థాలను కరిగిస్తుంది. ఈ మిశ్రమం కేవలం 30 నిమిషాల్లో డ్రెయిన్లలో వాసన కలిగించే బ్యాక్టీరియాను 92 శాతం వరకు నాశనం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి హానికర రసాయనాలు కలిగిన క్లీనర్ల కంటే ఇది చాలా ఉత్తమమైనది. అలాగే సర్ఫేస్ క్లీనింగ్ కోసం మైక్రోఫైబర్ క్లాత్‌లను వాడటం వల్ల బ్యాక్టీరియాను సులభంగా తొలగించవచ్చు.

Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. మత్తు వదిలిన యంత్రాంగం.. రాత్రికి రాత్రే మెట్రో పిల్లర్ గుంతల పూడ్చివేత!

హోటల్ పద్ధతిని ఇంట్లో ఎలా పాటించాలి?

ఈ పద్ధతిని ఇంట్లో అమలు చేయడం చాలా సులభం. క్రమం తప్పకుండా డ్రెయిన్లను బేకింగ్ సోడా, వెనిగర్‌తో శుభ్రం చేయడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవడం, తడి బట్టలను వెంటనే ఆరబెట్టడం, బొగ్గు లేదా కాఫీ పొడి వంటి సహజ పదార్థాలను చెడు వాసనలు పీల్చడానికి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కొద్ది సమయం కేటాయించి క్రమం తప్పకుండా ఈ పద్ధతులు పాటిస్తే.. ఇంటి బాత్‌రూమ్ కూడా ఏ స్టార్ హోటల్‌కూ తీసిపోని విధంగా ఎప్పుడూ ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉంటుంది.

Also Read: వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Tags

Related News

వామ్మో.. ఏకంగా అగ్నిపర్వతంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు, పేలితే?

సోలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ 4 ప్రదేశాలు సేఫ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ!

శివుడు ఖండించిన.. వినాయకుడి మొదటి మానవ రూప తల ఎక్కడుందో తెలుసా?

గర్భిణీలకు రైలులో లోయర్ బెర్త్ రూల్ ఇదే.. అప్పర్ బెర్త్ వస్తే ఏం చేయాలంటే?

ఇళ్లుంటాయి.. జనాలు ఉంటారు.. కానీ, అక్కడ ఊర్లకు పేర్లు ఉండవు, ఎందుకంటే?

విగ్రహం లేని 300 ఏళ్ల పురాతన ఆలయం.. కొండల్లో దాగిఉన్న ఈ గుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కనువిందు చేసే పక్షులు, కట్టిపడేసే గార్డెన్లు.. హైదరాబాద్‌ దగ్గర్లో ఇంత అద్భుతమైన పార్క్ ఉందా?

Big Stories

Advertisement
×