E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!
Advertisement

Eshwar Sai Controversy:ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌…సోషల్ మీడియాలో ఎక్కడ ఈ రెండు పేర్లే ఇపుడు వినిపిస్తున్నాయి. అయితే ఆనందంగా సాగిపోతున్నతమ ఏడేళ్ల వివాహ బంధంలో అసలు ఏం జరిగింది? భార్యాపిల్లలు ఉన్నారనే విషయం తెలిసీ ఈశ్వర్‌ ఎందుకు దారి తప్పాడు? కెమెరా పట్టుకుని గది తలుపులు తట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ మొత్తం కాంట్రవర్సీపై ఈశ్వర్‌ సాయి భార్య శరణ్య ఒక ఇంటర్వ్యూలో ఇలా అసలు విషయాలు చెప్పుకొచ్చింది.

అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

శరణ్య మాట్లాడుతూఈశ్వర్ సాయి మంచి ఫ్యామిలీ పర్సన్ అని మంచి కంటెంట్ క్రియేటర్ కూడా అని చెప్పుకొచ్చింది. కానీ గత రెండు, మూడు నెలలుగా ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది. షూటింగ్స్ పేరుతో ఇంటికి సరిగా రాకపోవడం, ఫోన్ కాల్స్ అస్సలు లిఫ్ట్ చేయకపోవడం వంటివి పెరిగాయని, ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని జరిగిన విషయం తెలిపింది.

Advertisement

ఇక తలుపు కొట్టినప్పుడు లోపల ఉన్న అసిస్టెంట్ బయటకు రావడమే కాకుండా, విచిత్రమైన డ్రామాలు ఆడారని చెప్పింది.లోపల ఈశ్వర్, మాధురి కలిసి ఉన్నారని ,అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను తానే స్వయంగా కావాలని అప్‌లోడ్ చేయలేదని, ఆ గొడవలో ఫ్యామిలీ మెంబర్స్ వద్ద ఉన్న ప్రూఫ్స్ పోలీసు స్టేషన్ కేస్ కోసం తీసినవి కాస్త బయటకు వచ్చి వైరల్ అయ్యాయని క్లారిటీ ఇచ్చింది.

ఇద్దరిదీ తప్పు ఉంది 

ఇక జరిగిన ఈ వివాదంలో కేవలం ఒక్కరినే అనడం సరికాదని శరణ్య స్పష్టం చేసింది.. “ఇక్కడ నా భర్త ఈశ్వర్ సైడ్ ఎంత తప్పు ఉందో,మాధురి రాథోడ్ సైడ్ కూడా అంతే తప్పు ఉంది. ఒకరికి భార్యాపిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు కనీస బాధ్యత ఉండాలి. పోనీ ఈశ్వర్ అయినా ‘నాకు పెళ్లయింది, బాబు ఉన్నాడు’ అని ఆలోచించాలి కదా? ఇద్దరూ కనీస విచక్షణ లేకుండా ప్రవర్తించారు” అని తీవ్ర స్థాయిలో మండిపడింది శరణ్య .

ట్రోలర్స్‌కి నా విన్నపం.. బాడీ షేమింగ్ ఆపండి

Advertisement

ఇక డెలివరీ తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల ఆధారంగా నెటిజన్లు చేస్తున్న బాడీ షేమింగ్‌పై శరణ్య తీవ్రంగా రియాక్ట్ అయింది. “నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను. ఆ సమయంలో నా బాడీలో ఎన్నో మార్పులు వచ్చాయి. భార్య ప్రశాంతత ఇవ్వకపోతే బయట వేరే అమ్మాయి తోడు వెతుక్కుంటారా? అని కామెంట్స్ చేసేవారు ఒక్కసారి ఆలోచించాలి. బాబుకి హెల్త్ బాగోలేనప్పుడు హాస్పిటల్‌కి ఒంటరిగానే తీసుకెళ్లాను, ఆ సమయంలో ఈశ్వర్ ఎక్కడున్నాడు?” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది,

అలాగే మాధురి రాథోడ్ విషయమై మాట్లాడుతూ… “ఆ అమ్మాయికి ఇంకా లైఫ్‌ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఈ ఒక్క సంఘటనతో తన జీవితం ముగిసిపోలేదు. చేసిన తప్పును తెలుసుకుని మారాలి తప్పిస్తే, ఇలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు” అని హితవు పలికింది.

నా పరువు, నా బిడ్డ భవిష్యత్తు ముఖ్యం!

ప్రస్తుతం ఈ విమర్శలు, సోషల్ మీడియా దాడి వల్ల తమ రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, పరువు పోయిందని బాధపడిపోయింది . తప్పు జరిగింది కాదనడం లేదు, కానీ ఇకనైనా ఆ వీడియోలను స్ప్రెడ్ చేయడం ఆపి,తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని ప్రజలను కోరింది.

also read :“నువ్వు ప*డుకోకుండా ఎదిగావా?”.. జాను లిరి వ్యాఖ్యలపై ఫోక్ వరలక్ష్మి ఫైర్!

చూడాలి మరి అడ్డంగా దొరికిన ఈశ్వర్ సాయి చేసిన తప్పును సరిదిద్దుకుని, మళ్లీ కుటుంబానికి దగ్గరవుతాడా లేదా లీగల్‌గా ముందుకు వెళ్తాడా అనేది కాలమే డిసైడ్ చేయాలి .

Tags

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Big Stories

Advertisement
×