E-Paper
Advertisement

నా బాడీ గురించి మీకెందుకు? సోనియా ఫైర్

నా బాడీ గురించి మీకెందుకు? సోనియా ఫైర్
Advertisement

Kissik Talks:సోషల్ మీడియాలో మహిళలపై,అందునా సెలెబ్రిటీలపై బాడీ షేమింగ్ చేస్తూ కొంతమంది ఆకతాయి నెటిజన్లు కామెంట్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే.ఇక విషయంపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది సోనియా ఆకుల.. తాజాగా విడుదలైన ‘కిస్సిక్ టాక్స్’ ఇంటర్వ్యూ ప్రోమోలో బాడీ షేమింగ్ పై సోనియా చేసిన కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

అమ్మాయిని ఆమె బాడీ ఆధారంగా జడ్జ్ చేయడం

సోనియా ఆకుల మాట్లాడుతూ పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా ఎన్నో మార్పులు వస్తాయని తెలిపింది. ఇక ఒక అమ్మాయిని కేవలం ఆమె బాడీ ఆధారంగా జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదని తేల్చి చెప్పింది. ఇక నెటిజన్లు సరదాగా చేసే కామెంట్లు ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో దెబ్బ తీస్తాయని స్పష్టం చేసింది.

Advertisement

Also read :బిగ్‌బాస్ హౌస్‌లో తనకు ఎదురైన ఘటనపై సోనియా ఆకుల ఓపెన్

ప్రతి కామెంట్ వెనుక ఒక మనిషి ఎమోషన్స్

అయితే ఒక పబ్లిక్ ఫిగర్ నటన లేదా ఇంటర్వ్యూలపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉంటుంది కానీ, వారి వ్యక్తిగత రూపురేఖలను టార్గెట్ చేయడం సమంజసం కాదని గట్టిగా హెచ్చరించింది సోనియా .మనం టైప్ చేసే ప్రతి కామెంట్ వెనుక ఒక మనిషి ఎమోషన్స్ ఉంటాయని ,ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొచ్చింది.

రెండు నెలల వయసులోనే గిన్నీస్ రికార్డ్స్

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన పాప శిఖ రెండు నెలల వయసులోనే సాధించిన గిన్నీస్ రికార్డ్స్ ని ఎంతో ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది సోనియా ఆకుల. ‘లాంగెస్ట్ డ్యూరేషన్ బై యాన్ ఇన్ఫాంట్ మెయింటైనింగ్ అసిస్టెడ్ అప్రైట్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ పామ్’ విభాగంలో తన కూతురు రికార్డ్ క్రియేట్ చేసిందని తెలిపింది.

Also read :సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తన తండ్రి అరచేతిపై ఏకంగా 2 నిమిషాల 43 సెకన్ల పాటు నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచిందని అలా ఏకంగా ఏడు అవార్డులు తను సొంతం చేసుకుందని పాప సాధించిన విజయాల్ని ఎమోషనల్ అవుతూ చెప్పింది సోనియా. ఇక తాము లండన్ లో జరిగిన అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్ళలేక పోవడంతో అవార్డ్ అందుకోలేక పోయామని చెప్పుకొచ్చింది .

 

ఆదివారం 8-30 కి వచ్చే కిస్సిక్ టాక్స్ చూడాల్సిందే !

మొత్తానికి సోనియా బాడీ షేమింగ్ పై అలాగే తన కూతురు సాధించిన రికార్డుల గురించి చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాల గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ ఆదివారం 8-30 కి వచ్చే కిస్సిక్ టాక్స్ చూడాల్సిందే !

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×