BigTV English

Viral Video: పంచెలో వచ్చిన రైతును మాల్‌లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది..

Viral Video: పంచెలో వచ్చిన రైతును మాల్‌లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది..

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక ఘటన వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా బెంగుళూరులో జరిగిన ఓ షాకింగ్ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భారతీయుల సంప్రదాయ దుస్తువులను చూసి విదేశీయులు కూడా పాటించడానికి సిద్ధమవుతున్న ఈ కాలంలో మన దేశస్తులు మాత్రం వేషాధరణ గురించి చర్చించుకోవడానికి, ఆ దుస్తుల్లో కనిపించిన వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన కేరళలో వెలుగుచూసింది. ఓ మాల్‌లోకి పంచెకట్టులో వచ్చిన రైతును అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.


ఓ వృద్ధ రైతు పంచెకట్టులో తన కొడుకుతో కలిసి జీటీ మాల్ లోకి వెళ్లాడు. ఈ తరుణంలో పంచెకట్టులో ఉన్న తనను చూసి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్యాంట్ వేసుకుని వస్తేనే లోపలికి అనుమతిస్తామని అన్నారు. అప్పటికే తాము టికెట్లు బుక్ చేసుకున్నామని ఆయన కొడుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా సెక్యూరిటీ వినలేదు. తన తండ్రి ఊరి నుంచి వచ్చారని, బట్టలు మార్చుకునే సమయం లేక పంచెకట్టులో వచ్చారని చెప్పారు. అయితే సిబ్బంది వీటిని వినకపోవడంతో ఇద్దరు కలిసి వెనుదిరిగారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు జీటీ మాల్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై బీజేపీ సహా కన్నడ లోకల్స్ కూడా నిరసన వ్యక్తం చేశారు. పంచెకట్టులో వెళితే ఇలా అవమానించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సీఎం సిద్ధరామయ్య కూడా పంచెకట్టులోనే ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. తిరిగి అదే మాల్ లోకి ఆ వృద్ధడికి ఘనంగా స్వాగతం పలికింది.


 

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×