Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అనే నానుడి ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు దంచికొట్టే రోహిణి కార్తెలో వర్షాలు పడుతున్నాయి.