E-Paper
Advertisement

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై కోర్టు స్టే.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు!

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై కోర్టు స్టే.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు!
Advertisement

Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. హైకోర్టు తీర్పును సాకుగా చూపి.. పేద ఆడబిడ్డలకు అందుతున్న సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆపేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆగస్టు 12న ఈ రెండు పథకాలపై కోర్టు స్టే విధించింది. వీటి కోసం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

సెప్టెంబర్ 9కి వాయిదా..

Advertisement

తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. కోర్టు కౌంటర్ దాఖలు చేయమని నాలుగుసార్లు గడువు ఇచ్చినా.. ప్రభుత్వం ఎందుకు దాఖలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా కేసుల్లో, మంత్రులపై అవినీతి కేసుల్లో కోట్లు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకునే ప్రభుత్వం.. ఆడబిడ్డల హక్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ హయాంలో 13 లక్షల మంది లబ్ధిదారులకు.. 13 వేల కోట్ల రూపాయల సాయం అందిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్..

Advertisement

మొదట 51 వేలతో మొదలైన కళ్యాణలక్ష్మి సాయం.. తర్వాత లక్షకు పెరిగింది. ఎన్నికల్లో కళ్యాణలక్ష్మికి తోడు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఉన్న పథకాన్నే ఎత్తేయాలని చూస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి, డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా?

కళ్యాణలక్ష్మి పథకం అమలు ఇప్పుడు.. వచ్చే సెప్టెంబర్ 9 నాటి కోర్టు విచారణపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా? పెండింగ్ చెక్కులు విడుదలవుతాయా? అని ఆడబిడ్డల తల్లిదండ్రుల ఎదురుచూస్తున్నారు.

Also Read: సిరిసిల్లలో ఘోర అగ్నిప్రమాదం.. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ దగ్ధం.. యూపీ కూలీ సజీవ దహనం!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×