E-Paper
Advertisement

తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!

తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!
Advertisement

Gurukula School: స్వేచ్చ బ్యూరో: తొర్రూరు పట్టణంలోని అన్నారం రహదారి సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులతో వంట పనులు, ఇతర పనులు చేయిస్తున్నారని, పాఠశాలలో ఏదైనా ఘటన చోటుచేసుకున్నప్పుడు మాత్రమే బాధ్యతను వర్కర్లపైకి నెట్టివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనలకు సంబంధించి ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా సమాచారం అందిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 28న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో విద్యార్థులతో కట్టెలు కొట్టించిన క్రమంలో ఓ విద్యార్థికి పంటికి గాయమైందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్‌ను బాధ్యుడిగా చూపేందుకు ప్రయత్నాలు జరిగాయని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి, వర్కర్‌ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పాలని సూచించారని పేర్కొంటున్నారు.

వాచ్‌మెన్‌ను విధులకు రానివ్వడం లేదని ఆరోపణ

గత తొమ్మిదేళ్లుగా పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మంగీలాల్‌ను ప్రిన్సిపాల్‌ విధులకు రానివ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడి ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించారని మంగీలాల్‌ వాపోయారు. ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా విద్యార్థి ప్రమాదానికి తననే బాధ్యుడిగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోని తరగతి గదుల్లోకి వెళ్లి ఘటనకు సంబంధించిన వాస్తవాలను ఎవరూ బయటకు చెప్పకూడదని విద్యార్థులను హెచ్చరిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

నన్నెందుకు తొలగిస్తారు సార్‌..?

Advertisement

పాఠశాల వాచ్‌మెన్‌ మంగీలాల్‌ మాట్లాడుతూ…విద్యార్థి ప్రమాద ఘటనతో నాకు సంబంధం ఏముంది సార్‌ ..అయినా నన్నే బాధ్యుడిగా చేసి విధులకు రానివ్వడం లేదు. నన్ను తొలగించమని స్థానిక ఎంపీడీవో చెప్పారని ప్రిన్సిపాల్‌ అంటున్నారు. అయితే ఈ విషయంపై ఎంపీడీవోను అడిగితే తాను ఎవరినీ తొలగించమని చెప్పలేదని తెలిపారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన భార్య శ్రీదేవిని కూడా ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించారని మంగీలాల్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని గతంలో ఆర్‌సీఓ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ప్రస్తుత ఆర్‌సీఓను కలిసినా న్యాయం జరగలేదని తెలిపారు. తాజాగా తనను లక్ష్యంగా చేసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

Also read: ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?

ఎవరినీ తొలగించమని చెప్పలేదు

Advertisement

ఈ విషయంపై ఎంపీడీవో వెంకటేశ్వర్లును వివరణ కోరగా..నేను ఎవరినీ తొలగించమని చెప్పలేదు,ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా నాకు లేదు,గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆహారం ఎలా అందిస్తున్నారు, మౌలిక వసతులు ఉన్నాయా లేదా అన్న అంశాలను పర్యవేక్షించడం వరకే నా బాధ్యత అని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌ చెబుతున్నట్లు ఎంపీడీవో చెప్పలేదని, ఎంపీడీవో వివరణకు ప్రిన్సిపాల్‌ వాదనకు పొంతన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు

విద్యార్థి గాయపడిన ఘటన, వాచ్‌మెన్‌పై తీసుకున్న చర్యలపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధిత వాచ్‌మెన్‌కు న్యాయం చేయాలని మంగీలాల్‌ విజ్ఞప్తి చేశారు.

Also read: సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

Tags

Related News

ఎన్ని చిప్పలు, బాత్రూమ్‌లు కడిగి కోట్లు సంపాదించావ్!.. కేటీఆర్ పై ఊగిపోయిన సీఎం రేవంత్!

కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఖాయం.. కేసీఆర్ మళ్లీ సీఎంగా రాబోతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×