E-Paper
Advertisement

TDP vs Jana Sena: కూటమిలో చీలికలేనా? వివాదాలపై టీడీపీ స్ట్రాంగ్ యాక్షన్.. జనసేన ఎందుకు మౌనం?

TDP vs Jana Sena: కూటమిలో చీలికలేనా? వివాదాలపై టీడీపీ స్ట్రాంగ్ యాక్షన్.. జనసేన ఎందుకు మౌనం?
Advertisement

TDP vs Jana Sena: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీ అధిష్టానాల తీరు పై రాజకీయ వర్గాల్లో ఒక వింతైన చర్చ సాగుతుందట. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పార్టీ నేతలపై టీడీపీ క్విక్ రియాక్షన్ అంటుంటే … అవే ఆరోపణలతో పార్టీకి డ్యామేజ్‌గా మారిన వారిపై జనసేన నో యాక్షన్ అంటోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఓ పార్టీ ఆగ మేఘాల మీద స్పందిస్తుంటే… మరో పార్టీ నాన్చుడి ధోరణతో ముందుకు వెళుతుంటడం విమ్శల పాలవుతోంది.. ప్రశ్నించడానికే ఉన్నాం.. అంటున్న జనసేనాని తనవారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు?

పార్టీ ఏదైనా వివాదాలు కామన్

ఏపీ పాలిటిక్స్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతల వివాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పార్టీ ఏదైనా వివాదాలు కామన్ ..అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా కూటమిలో కీలకంగా ఉన్న తెలుగుదేశం , జనసేన నాయకులు పోటాపోటీగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఏదాదిన్నర ముందు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంతో మొదలైన వివాదాలు… తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌యాదవ్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోతో అడ్డంగా దొరికిపోతే… ఏలూరు ఎంపీ ఏకంగా డ్రగ్స్ సేవించి దొరికిపోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక జనసేన పార్టీలో తిరుపతి నేతకిరణ్ రాయల్ రాసలీలతో మొదలైన వ్యవహారం… రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, పశ్చిమగోదావరి జిల్లా చెందిన మరో ఎమ్మెల్యే వసూళ్ల ఎపిసోడ్‌లతో హైలెట్ అవుతూ.. పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయని స్వయంగా జనసైనికులే వాపోతున్నారంట.. అటు తెలుగుదేశం, ఇటు జనసేన లో నేతల వివాదాలు కామన్ గా ఉన్నప్పటికీ… తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపైన కొంత పాజిటివ్ చర్చ జరుగుతోంది.

Also Read :Jana Sena: అధిష్టానం సీరియస్.. నేతలు లైట్.. జనసేనలో అసలు ఏం జరుగుతోంది? 

పుట్ట మహేష్ యాదవ్ ని పార్టీ నుండి సస్పెండ్

Advertisement

వాస్తవానికి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం బయటపడిన వెంటనే తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు పై అప్పట్లో పొలిటికల్ గా పెద్ద ఎత్తున చర్చ సాగింది.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే…ఎమ్మెల్యే వ్యవహారం బయటకు రావడం, టీడీపీ అధిష్టానం ఎంతో స్పీడ్ గా స్పందించి… ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. అప్పట్లో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పై చాలామంది పాజిటివ్ రియాక్ట్ అయ్యారు.. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని, చాలా క్విక్ రియాక్షన్ పార్టీ నుండి వచ్చిందని ప్రశంసించారు. ఇక తాజాగా టిడిపి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ స్పీడ్ గానే రియాక్ట్ అయిందని. మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో పుట్టా పట్టుబడటం, డ్రగ్స్ తీసుకున్నారని తెలిసిన వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించి.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని టీడీపీ అధిష్టానం అందరికీ స్పష్టమైన వార్నింగ్ ఇవ్వగలిగిది. షోకాజ్ నోటీసులకు ఎంపీ నుంచి వివరణ రాగానే తదుపరి ఏం చేయాలనే అన్నదానిపై పార్టీ సమాలోచనలు జరుపుతోంది. అంతేకాదు పుట్ట మహేష్ యాదవ్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

 ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?

తెలుగుదేశం పార్టీ ఏ విషయంలో అయినా క్విక్ రియాక్షన్ చూపిస్తుంటే…. కూటమిలో కీలకంగా ఉన్న మరో పార్టీ జనసేన మాత్రం.. అందుకు భిన్నంగా ముందుకు వెళుతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం గతంలో జనసేన పార్టీ కీలక నేత కిరణ్ రాయల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినప్పటికీ .. అతని పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు. పైపెచ్చు విచారణ చేశామని, కిరణ్ రాయల్‌ది తప్పేమీ లేదని క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. ఇక ఈ ఏడాది జనవరిలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో కూడా… జనసేన పార్టీ ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శలు ఉన్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన అరవ శ్రీధర్‌పై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ… ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓవైపు బాధితురాలు వరుసగా వీడియోలు విడుదల చేస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ… పార్టీపరంగా సరైన నిర్ణయం తీసుకోకుండా… కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆడియోలు, వీడియోలలో అడ్డంగా దొరికిన.. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయకుండా ఉండడం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఓవైపు తెలుగుదేశం లో ఇదే తరహాలో ఎమ్మెల్యే తప్పు చేస్తే… అతన్ని వెంటనే సస్పెండ్ చేసింది. కానీ అందుకు భిన్నంగా జనసేన మాత్రం యాక్షన్ తీసుకోకుండా వదిలేయడానికి .. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్

Advertisement

మరోవైపు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చెందిన మరో జనసేన ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.. టీడీపీ నేతలు సదరు ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని, ఇప్పటికే పెద్దమొత్తంలో వెనకేసుకున్నారని మాట్లాడుకున్న ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ ఇప్పటికీ ఆ ఎమ్మెల్యే మీద జనసేన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం… అసలు విచారణకే ఆదేశించకపోవడం .. వైసీపీకి అస్త్రంగా మారింది. ఇలా కూటమిలో ఉన్న రెండు పార్టీలలో ఒక పార్టీ వేగంగా స్పందిస్తుంటే…. మరో పార్టీ మాత్రం చర్యలు తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం.. అందులోనూ.. ప్రశ్నించడానకే వచ్చాం.. అని ఆవేశంగా ప్రసంగాలు ఇచ్చే జనసేనాని ఈ వ్యవహారాలపై సరైన యాక్షన్ తీసుకోకపోవడం ఆ పార్టీ వర్గాలకే మింగుడు పడటం లేదంట. ఏది ఏమైనా.. కూటమిలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు రెండు పార్టీలకు కొంత ఇబ్బందికరంగానే మారుతున్నాయి.

Story By AppaRao, Big Tv

Also Read Crime News: మియాపూర్‌లో దారుణం.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×