E-Paper
Advertisement

ఆర్టీసీలో సమ్మె సైరన్.. 10 వేల కోట్ల చిక్కుముడి పరిష్కారం సాధ్యం అయ్యేనా..!

ఆర్టీసీలో సమ్మె సైరన్.. 10 వేల కోట్ల చిక్కుముడి పరిష్కారం సాధ్యం అయ్యేనా..!

RTC Strike: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కార్మికులు సమ్మెకు దిగడం ఇది మూడోసారి. వేతన సవరణ చేపట్టాలనే ప్రధాన డిమాండ్‌తో 2015లో 8 రోజులపాటు సమ్మె చేశారు. ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో నాడు సమ్మెను విరమించారు. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు 52 రోజులపాటు 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సుదీర్ఘ సమ్మె చేశారు. కానీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో చివరకు ఎలాంటి లిఖితపూర్వక హామీ లేకుండా కార్మికులు విధుల్లో చేరారు. ఇప్పుడిది మూడోసారి సమ్మెకు దిగడం.

సంక్షోభానికి కారణాలు..

ఆర్టీసీ ప్రస్తుత సంక్షోభానికి కారణాలు ఏంటని చూస్తే ఒకటి కాదు రెండు లెక్కకు అందని విధంగా ఉన్నాయి. అసలు కార్మికులు ప్రస్తుతం పెట్టిన 32 డిమాండ్లు.. అందులో ప్రభుత్వం నెరవేర్చేవి ఏంటి… చిక్కుముడులు పడినవేంటో.. ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. 30% ఫిట్‌మెంట్‌తో 2021 వేతన సవరణ చేయడం, 2025 వేతన సవరణనూ పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలివ్వాలని, ప్రభుత్వ సర్వీసులో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయాలన్న డిమాండ్ పెట్టారు. ప్రస్తుత కార్పొరేషన్‌లోని సౌకర్యాల్ని కొనసాగించాలని, ఆర్టీసీ అప్పుల్ని ప్రభుత్వమే టేకోవర్‌ చేయాలన్నది మరో ప్రధాన డిమాండ్. ఇక సంస్థను ఆధునీకరించడం, 2017 నుంచి అలవెన్సులు, ఫ్రింజ్‌ బెనిఫిట్లు పెంచాలనడం, వేతన సవరణ బకాయిల్ని చెల్లించాలంటున్నాయి సంఘాలు. రిటైర్డ్‌ ఉద్యోగులకు 2017 వేతన సవరణ చేయాలని, వారి బకాయిల్ని చెల్లించాలంటున్నారు.

అర్హులకు పదోన్నతి..

ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న కార్మికుల సీసీఎస్, పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్‌ నిధుల్ని విడుదల చేయాలని, సీసీఎస్‌లో పాలకమండలి ఎన్నికల్ని నిర్వహించాలంటున్నారు. అన్ని కేటగిరీల్లో ఖాళీల్ని భర్తీ చేయడం, అర్హులకు పదోన్నతి ఇవ్వడం, బ్రెడ్‌విన్నర్, మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ ఉద్యోగుల కుటుంబాలకు రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగాలివ్వడం, కన్సాలిడేటెడ్‌ కింద పనిచేస్తున్న వారి సర్వీసును రెగ్యులర్‌ చేయడం, ప్రతి కార్మికునికి 21రోజుల హాజరుతో ఇన్సెంటివ్‌ ఇవ్వడం, అలాగే వివిధ వర్గాలకు టిక్కెట్ పై ఇస్తున్న రాయితీలు, సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించడం ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి.

Also Read: రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే 2500 పోస్టులకు నోటిఫికేషన్

తార్నాక హాస్పిటల్..

ఈవీ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలని, కొత్త ఎలక్ట్రిక్‌ డిపోల్ని ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటుచేయాలని, ప్రైవేటు ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్టీసీ స్థలాలివ్వొద్దంటున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు జీరో టికెట్‌ బదులు స్మార్ట్‌కార్డు ఇవ్వాలన్నది మరో డిమాండ్. ఈ పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన 400 కోట్ల మొత్తాన్ని ప్రతి నెలా కోత పెట్టకుండా చెల్లించాలంటున్నారు. పాత బకాయిలు 2,500 కోట్లు ఇవ్వాలని చెప్పుకొచ్చారు. తార్నాక హాస్పిటల్ లోని అన్ని విభాగాల్లో సిబ్బందిని రెగ్యులర్‌ బేసిస్ పై నియమించడం, రోగులు, సహాయకులకు భోజన వసతి కల్పించడం ఇలాంటివి ప్రభుత్వం ముందు పెట్టారు. ఎకౌంట్స్‌ విధానంలో సెంట్రలైజేషన్‌ రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించడ, అలాగే ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న రిటైర్డ్‌ అధికారులు, సూపర్‌వైజర్లను తొలగించం, డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌ల నియామకాల్ని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టవద్దన్న డిమాండ్లు పెట్టారు. ఫైనల్ గా 2019 సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదైన పోలీసు కేసుల్ని ఎత్తేయడం, 8 గంటల పని విధానాన్ని అమలుచేసి మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా ఇంటికి చేరుకునేలా డ్యూటీలు వేయడం, టీజీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ఏపీ వాసుల్ని ఏపీఎస్‌ఆర్టీసీకి బదిలీ చేయాలి ఇలా మొత్తం 32 ప్రధాన డిమాండ్లు మెన్షన్ చేశారు.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్..

కార్మికులు పెట్టిన డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం నెరవేర్చేందుకు రెడీ అంటోంది. కొన్ని డిమాండ్లలో చిక్కుముడులు ఉన్నాయ్. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్… ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేయడం ఒక సవాల్ గా ఉంది. ఉద్యోగులను కేవలం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కిందకు మార్చడం కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమానంగా చూడాలని కార్మికులు కోరుతున్నారు. ఇది సంక్లిష్టమైన ఆర్థిక, పరిపాలనాపరమైన నిర్ణయం. రవాణా మంత్రి చేతుల్లో ఉండదు. ప్రభుత్వ ఖజానాపై భారీ భారం సంగతి పక్కన పెడితే.. సర్వీస్ రూల్స్ తయారీలో టెక్నికల్ సమస్యలు చాలా వస్తాయంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్.. ఆర్టీసీ కార్మికుల సర్వీస్ రూల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. పని విధానాలు, సెలవులు ఇలా ఏ విషయం తీసుకున్నా వేటి లెక్క దానికే ఉంటుంది.

నెంబర్ టూ…

యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం మరో సవాల్ గత కొన్నేళ్లుగా ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు జరగలేదు. కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేసింది.
కోర్టు కేసులు, ఇతర చట్టపరమైన చిక్కులు ఉన్నాయి. లేబర్ కోడ్ పై కేంద్రం కొత్త రూల్స్ తెస్తుండడం కూడా మరో ప్రధాన అడ్డంకిగా ఉంది.

Also Read: కాంగ్రెస్ నాయకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో పదవులు భర్తీ.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..!

నెంబర్ త్రీ..

ఎలక్ట్రిక్ బస్సుల ఇష్యూ. వీటిని సొంతంగా కొనడం ఆర్టీసీకి అసాధ్యం. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర సుమారు కోటిపైనే ఉంటుంది. అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి వీటిని కొనడం కష్టమే. ఇలాంటి వాటి కోసం కేంద్రం భారీ సబ్సిడీ స్కీం ఒకటి పెట్టింది. ప్రైవేట్ వారితో ఈవీలు కొనిపించి, GCC మోడల్ లో వెళ్తే భారీ రాయితీలు వస్తాయి. అంటే ఇవన్నీ అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ వారి చేతిలోనే ఉంటాయి. అటు ఆర్టీసీ సంస్థకు భారం కాదు. కానీ ఇది ప్రైవేటీకరణకు దారితీస్తుందని కార్మికులు భయపడుతున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సుల పథకం 2018లోనే ప్రారంభమైందని, అది కేంద్ర ప్రభుత్వానిదని ఎలక్ట్రిక్ బస్సులతో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదని ప్రభుత్వం అంటోంది.

ప్రైవేట్ వారితో ఈవీలు..

ఇది పైకి చెప్పకపోయినా కీలకమైన ఇష్యూనే. 2021లో పెండింగ్‌లో ఉన్న 30% ఫిట్‌మెంట్‌తో పాటు 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న PF, CCS బకాయిలను తీర్చాలని కోరుతున్నారు. ఇవంతా కలిపితే 10 వేల కోట్లకు సంబంధించిన మ్యాటర్. ఈ మొత్తాన్ని అంతా ఒకేసారి విడుదల చేయడం ప్రభుత్వానికి అయ్యే పని కాదు. కార్మికులు కోరింత ఫిట్ మెంట్ కాకపోయినా ఎంతో కొంత తక్కువకు సెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

అందరికీ అర్థమయ్యే విషయం

ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే.. ఆర్టీసీ ఆదాయం పెరిగితేనే సంస్థకు మనుగడ ఉంటుంది. లేకపోతే నిర్వహణా భారాలతో, ఇప్పటికే ఉన్న ఆస్తుల్ని కుదువ పెట్టి చివరికి అమ్మేసి దివాళా తీసే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ప్రభుత్వం తెరవెనుక ఉండి నడిపిస్తుంది కాబట్టి దివాళా దాకా వెళ్లదు. బట్ ఇదే సంక్షోభం ఇంకెన్ని సంవత్సరాలైనా కంటిన్యూ అవుతుంది. ఇదీ సమస్య.

Also Read: రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?

మహాలక్ష్మి స్కీం కోసం..

ఇటీవలి బడ్జెట్ లో TGSRTCకి 6,371 కోట్లు కేటాయించింది ఇందులో 4,305 కోట్లు మహాలక్ష్మి స్కీం కోసం కేటాయించింది. ఇది చూసినా ఆర్టీసీకి బడ్జెట్ అదిరిపోయిందనిపిస్తుంది. కానీ వాస్తవంలో కథ మరోలా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సగటున నెలకు 350 కోట్ల నుంచి 400 కోట్ల దాకా ఆర్టీసీకి కేటాయిస్తోంది. అయితే ఇందులో పాత బకాయిలే 2,500 కోట్లు ఇవ్వాలి.

ప్రస్తుతం ఆస్తుల విలువ..

ఇంత చేసి ఆర్టీసీకి ఆస్తులేమైనా తక్కువగా ఉన్నాయా అంటే అది కూడా కాదు. సంస్థ ఆధీనంలో 1,521 ఎకరాల దాకా భూమి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ ఆస్తుల మార్కెట్ విలువను 8,190 కోట్లుగా లెక్కగట్టారు. ప్రస్తుతం ఈ ఆస్తుల విలువ 50 వేల కోట్ల పైమాటే ఉంటుంది. ఇక TGSRTC మొత్తం బకాయిలు సుమారు 9,200 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా సంస్థ ఇప్పటికే కొన్ని ప్రధాన ఆస్తులను కుదువ పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఇందులో జూబ్లీ బస్టాండ్, గౌలిగూడ బస్టాండ్, ఉప్పల్ వర్క్‌షాప్, బర్కత్‌పుర డిపో వంటి కీలక ఆస్తులపై సుమారు 1,500 కోట్ల వరకు బ్యాంకు రుణాలు ఉన్నాయి. ఇతర బ్యాంకు బాకీలన్నీ కలిపితే ఈ మొత్తం 2,743 కోట్లుగా ఉందంటున్నారు.

TGSRTC అధికారిక వెబ్‌సైట్‌లో..

పోయేవి పోతున్నాయి.. మరి వచ్చే వాటిపైన శ్రద్ధ ఉందా అంటే అదీ లేకుండా పోతోంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల నుంచి రావాల్సిన కచ్చితమైన పెండింగ్ మొత్తాన్ని TGSRTC బహిరంగంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచలేదు. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి ఆర్టీసీ వెబ్ సైట్ చూస్తే బస్సులు, ట్రిప్పులు ఇలాంటి లెక్కలున్నాయి తప్ప ప్రైవేట్ వ్యక్తులు, లీజుల రూపంలో ఎంత రావాలో బూతద్దం పెట్టి వెతికినా దొరకదు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు లీజు దారులను అదృశ్య శక్తులు కాపాడుతూ వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరు ఆర్టీసికి శఠగోపం పెట్టేశారు కూడా. డబ్బుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వరుసగా నోటీసులు ఇచ్చి, స్థలాల స్వాధీనం దిశగా అడుగులు పడ్డాయి.

Also Read: బస్తీ దవాఖానాల్లో వైద్య విప్లవం.. తొమ్మిది రెట్లు పెరిగిన రోగులు ఇదిగో లెక్కలు..?

సీసీఎస్‌ ఖాతాలో జమ..

ఇక ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మరో ప్రధాన సమస్య ఉంది. అదేంటంటే.. ఆర్టీసీ ఉద్యోగులు క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. తమ జీతం బేసిక్‌లో ప్రతినెలా 4.5 శాతం మొత్తాన్ని అందులో పొదుపు చేస్తున్నారు. వారి జీతంలోంచి ఈ మొత్తాన్ని మినహాయించి సీసీఎస్‌ ఖాతాలో జమ చేయాల్సిన ఆర్టీసీ యాజమాన్యం… ఆర్థిక ఇబ్బందుల పేరుతో తన అవసరాలకు వాడుకోవడంతో సమస్య వచ్చింది. ప్రస్తుతం సీసీఎస్‌లో 30,653 మంది ఉద్యోగులు, 9,795 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. పీఎఫ్, సీసీఎస్ ఇతర పెండింగ్ ఎరియర్స్ అన్నీ కలిపి సంస్థ దాదాపు 2,609 కోట్లు ఉద్యోగులకు, మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండేది. నిజానికి ఈ మొత్తాన్ని కాంగ్రెస్ వచ్చాక క్రమంగా చెల్లిస్తూ వస్తోంది. మిగితా బాకీని కూడా క్లియర్ చేయాల్సి ఉంది. నిజానికి ఆర్టీసీ మరీ కమర్షియల్ కాదు. ప్రజలకు సేవ చేసే కోణంలోనూ ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట ఉదయం 3.30 గంటలు, 4 గంటల నుంచే బస్సు సర్వీసులు మొదలవుతుంటాయి. పెద్దగా ప్రయాణికులు లేకపోయినా ఉండే ఆ కొద్ది మంది కోసం కూడా లాభాపేక్ష లేకుండా నడపాల్సి వస్తుంది.

ప్రభుత్వంలో విలీనం..

ఏపీలో ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే అక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. కార్పొరేషన్ లో ఉన్న వాటి కంటే తక్కువ మేలు జరిగింది. విలీనం కావడం వల్ల స్పెషల్ ఇన్సెంటివ్ లు రాకుండా పోయాయి. హాస్పిటల్స్ లో వైద్యం విషయంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే తెలంగాణ కార్మికులు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూనే.. కార్పొరేషన్ లో ఉన్న బెనిఫిట్స్ కల్పించాలని 32 డిమాండ్లలో ఒకటిగా పెట్టారు.

ఆర్టీసీ నష్ట్రాలకు కారణాలు..

ఫైనల్ గా ఒక్కటి నిజం.. ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయంటే వంద కారణాలు ఉన్నాయి.
వాటిని ఇన్నేళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు..
కార్యాచరణ చేపట్టలేదు..
కొన్ని కీలకమైన కారణాలు చూద్దాం..
నెంబర్ వన్.. ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో ప్రైవేట్ బస్సులను తిప్పడం..
లాభాలు వచ్చే రూట్లను అద్దె బస్సులకు ఇచ్చి, నష్టాలు వచ్చే రూట్లు అయిన గ్రామీణ ప్రాంతాలను సొంత బస్సులకు కేటాయించడం వల్ల ఆర్టీసీ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడూ నెగటివ్‌లోనే ఉంటోందన్నది కార్మికులు చేస్తున్న వాదన.
నెంబర్ టూ.. ఆర్టీసీ స్థలాలు, బస్టాండ్ లలో షాపులను లీజుకు ఇచ్చిన వారి నుంచి డబ్బులు రాబట్టుకోలేకపోవడం..
నెంబర్ త్రీ.. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించకపోవడం..
నెంబర్ ఫోర్… సామగ్రి, సిబ్బంది, నిర్వహణ ఖర్చులపై కంట్రోల్ చేయకపోవడం…
నెంబర్ ఫైవ్.. బస్సులు నడపడంలో లోపాలు
నెంబర్ సిక్స్.. రాబడి లీకేజీలను నివారించకపోవడం..
నెంబర్ సెవెన్.. వృథా ఖర్చుల్ని కంట్రోల్ చేయలేకపోవడం..
నెంబర్ 8.. ఆటోమేషన్, ఇన్నోవేషన్, మెకనైజేషన్‌ అవకాశాలను క్యాచ్ చేసుకోకపోవడం..
ఇలా చెప్పుకుంటూ వెళ్తే కథ చాలా దూరమే ఉంటుంది. సో ముందుగా ప్లానింగ్ ఆ తర్వాత ఎక్జిక్యూషన్ కీలకంగా మారాలి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.
ఇది జరగాలంటే చాలా ప్రక్షాళన చేయాలి.

Also Read: PSLలో దిక్కుమాలిన‌ రూల్స్‌..టాస్ స‌మ‌యంలో ఇక‌పై ఇలా త‌న్నుకోవాల్సిందే

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×