Ashwin Babu: నటుడు అశ్విన్ బాబు “వచ్చినోడు గౌతమ్” సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మూవీ గురించి ,థమన్ పై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఆ వివరాలు చూద్దాం . .
వచ్చినోడు గౌతమ్..టీజర్ లాంచ్..
టీజర్ అద్భుతమైన నాణ్యతకు కారకులైన దర్శకుడు బాల్ రెడ్డి, నిర్మాతలు రవి , గణపతి రెడ్డిలను అశ్విన్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. పవర్ స్టార్ మంచు మనోజ్ తన బలమైన వాయిస్ ఓవర్‌తో టీజర్‌కు మరింత బలాన్నిచ్చారని కొనియాడారు. నిర్మాత గణపతి రెడ్డి సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.దర్శకుడు బాల్‌రెడ్డి విజువల్ స్టోరీ టెల్లింగ్‌ను, ఆర్ట్ డైరెక్టర్ , ఇతర సాంకేతిక నిపుణుల సహకారాన్ని అశ్విన్ బాబు మనసారా మెచ్చుకున్నారు. కృష్ణ అద్భుతమైన కథను అందించారని, హరి గౌర్ అందించిన సంగీతం చాలా బాగుందని ఆయన అన్నారు. దర్శకుడు శైలేష్ కోలా తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ వల్లే తమన్ బక్కచిక్కిపోయాడు..
అశ్విన్ బాబు సంగీత దర్శకుడు తమన్‌పై ప్రత్యేకమైన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమన్ అంటే తనకు చాలా ఇష్టమని, వారి మధ్య ఒక బలమైన స్నేహబంధం ఉందని ఆయన చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’కి తమన్ సంగీతం అందిస్తున్న సమయంలో కూడా, తమన్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా బ్రేక్ తీసుకుని వచ్చారని అశ్విన్ వెల్లడించారు. అంతేకాకుండా, ఈవెంట్‌లోని ప్రేక్షకులు సరదాగా మాట్లాడుతూ, ‘ఓజీ’ సినిమాకు మ్యూజిక్ కొట్టి కొట్టి తమన్ బక్కగా మారిపోయారని అనగా, అశ్విన్ బాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. తమన్ తనకు ముందే చెప్పాడని, ‘ఓజీ’ సినిమాకు సంగీతం వేరే స్థాయిలో ఉంటుందని, అదిరిపోతుందని అశ్విన్ తెలిపారు. తమన్ సంగీత పరిశ్రమలో ఒక సంచలనం అని, ఆయన మద్దతు తనకు ఎప్పటికీ ఉంటుందని అశ్విన్ బాబు స్పష్టం చేశారు. ఈ టీజర్ ఇంత బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బాల్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.