BigTV English
Advertisement

Shubham: ఫైనాన్సియల్ హిట్ కొట్టిన సమంత.. వారంలోనే పెట్టిందంతా వచ్చేసిందిగా..

Shubham: ఫైనాన్సియల్ హిట్ కొట్టిన సమంత.. వారంలోనే పెట్టిందంతా వచ్చేసిందిగా..

Shubham: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా,మారి ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై, కొత్త నటీనటులతో శుభం మూవీని నిర్మించారు. సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల, ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సమంత అతిధి పాత్రలో నటించారు. మే 9న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక నాలుగు రోజులకే మంచి కలెక్షన్స్ ని సాధించింది. సమంత పెట్టిన బజెక్ట్, వచ్చిన లాభాలు చూద్దాం ..


వారంలోనే పెట్టిందంతా వచ్చేసిందిగా..

సమంత నిర్మాతగా తన మొదటి అడుగులోనే సక్సెస్ ని అందుకుందని చెప్పొచ్చు. ప్రతి ఒక కుటుంబానికి పూర్తి వినోదాన్ని అందించేది మొదట సీరియల్స్, వాటి వల్ల ఫ్యామిలీ మెంబర్స్ పడే కష్టాలను ఓ పాయింట్ గా తీసుకొని ఈ మూవీని థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దాదాపు ఈ సినిమాని సమంత 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, ఫ్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయలషేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో, మూవీ పైన అంచనాలు కూడా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు వరల్డ్ వైస్ గా 500 స్క్రీన్ లలో ఈ మూవీని రిలీజ్ చేయడం విశేషం. శుభం మూవీ బడ్జెట్ 5 కోట్లు విడుదలైన వారం రోజుల లోపే, ఐదు కోట్ల గ్రాస్ ను దాటేసింది. ఇక తాజాగా సాటిలైట్ ఆడియో రైట్స్ 1.5 కోట్లకు, డిజిటల్ రైట్స్ 3.5 కోట్లకు అమ్మకం జరిగినట్లు సమాచారం. వారంలోనే పెట్టిందంతా వచ్చేసింది. సినిమా వర్కింగ్ డేస్ లోను, కలెక్షన్స్ జోరును చూపిస్తోంది. ఫైనాన్షియల్ గా మొదటి సినిమాతోనే సమంత హిట్టు కొట్టిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు


లాభాల దిశగా శుభం మూవీ ..

ఓవరాల్ గా శుభం సినిమా రిలీజ్ కి ముందే భారీ లాభాలను నమోదు చేసింది. ఈ సినిమా శాటిలైట్,ఓటీటీ రైట్స్, భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. సమంత పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూసుకుంటే విడుదలకు,ముందే ప్రాఫిట్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మూవీ సక్సెస్ కోసం సమంత ప్రమోషన్స్ లో గట్టిగా నిర్వహించింది. కంటెంట్ పై నమ్మకంతో,రెండు రోజులు ముందు నుంచి ప్రీమియర్ షోలు వేశారు. శుభం మూవీ మే 9 థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ తో సక్సెస్ దిశగా దూసుకుపోతుంది . ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి.శర్వాణి లక్ష్మి, శాలిని, కొండెపూడి వంశీధర్ గౌడ్. ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని క్లింటన్ సిరోజ్ అందించారు.

Amzon Prime Video : సడన్ షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో… డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇక దండగ

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×