Sree Vishnu on Dialogues: ఏ సినిమాలో అయినా కాస్త బూతు పదాలు వినిపించినా చాలు.. వెంటనే సెన్సార్ దానిని కట్ చేసేస్తుంది. వెంటనే అలాంటి పదాలను మ్యూట్ చేయమని గానీ లేదా మార్చమని గానీ ఆదేశిస్తుంది. సెన్సార్‌ను దాటి సినిమాల్లో బూతు పదాలు వినిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ యంగ్ హీరో శ్రీ విష్ణు చేసిన ప్రతీ సినిమాలో సెన్సార్‌ను దాటి మరీ బూతులు బయటికి వస్తాయి. అలా అని అవి ప్రేక్షకులను నేరుగా అర్థం కూడా కావు. ఎవరో ఒక నెటిజన్.. శ్రీ విష్ణు నటించిన ఒక సినిమాలో తను మాట్లాడింది గమనించి వింటే బూతులాగా ఉందని చెప్తే అప్పటినుండి అది వైరల్ అయ్యింది. అలా తను మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగులపై శ్రీ విష్ణు తాజాగా స్పందించాడు.
అలాంటివి ఉండవు
శ్రీ విష్ణు సినిమా అంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయని, అర్థం కాకుండా బూతులు ఉంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం మంచి ట్రాక్ రికార్డ్‌తో దూసుకుపోతున్న ఈ హీరో.. ప్రస్తుతం ‘సింగిల్’ అనే సినిమాతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన సినిమాల్లో ఉండే డబుల్ మీనింగ్ డైలాగుల గురించి శ్రీ విష్ణుకు ప్రశ్న ఎదురయ్యింది. ‘సింగిల్’ సినిమాలో కూడా అలాంటి డైలాగులు, పాటలు ఉంటాయా అని ప్రశ్నించగా దానికి శ్రీ విష్ణు ఇచ్చిన సమాధానం చాలా వైరల్ అవుతోంది. అసలు తను అలాంటి మాటలే మాట్లాడను అన్నట్టుగా ఫన్నీ సమాధానమిచ్చాడు ఈ యంగ్ హీరో.
అది సంస్కృతం
‘‘నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు అస్సలు ఉండవు. సంస్కృతం ఎక్కువగా ఉంటుంది. దానినే చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. మరి ఆ సంస్కృతం నేర్పడం కష్టం. నా సినిమాల్లో ఆడవాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని మీ అందరికీ తెలుసు. అలాంటి పాటలు ఇందులో ఏం లేవు’’ అంటూ క్లారిటీ ఇచ్చాడు శ్రీ విష్ణు. అయినా తను మాట్లాడుతున్నప్పుడు వ్యంగ్యంగా నవ్వినప్పుడే ‘సింగిల్’ సినిమాలో కూడా అలాంటి డైలాగులు ఉండడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. అయితే తను సినిమాల్లో మాట్లాడే సంస్కృతం గురించి థియేటర్లలో ప్రేక్షకులకు అర్థం కావడం లేదని ఓటీటీలో వచ్చిన తర్వాతే అర్థమవుతుందని స్పష్టం చేశాడు.
Also Read: అప్పటినుండి హిట్ లేదు.. దీంతో కమ్ బ్యాక్ ఇస్తాడు
ఇంట్రెస్టింగ్ ట్రైలర్
శ్రీ విష్ణు (Sree Vishnu) అప్‌కమింగ్ మూవీ ‘సింగిల్’ (Single)కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. తన ప్రతీ సినిమాలాగానే కామెడీతో పాటు ఏదో సోషల్ మెసేజ్ కూడా ‘సింగిల్’లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చేస్తుంటేనే ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేస్తోంది. కార్తిక్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేతిక శర్మ, ఇవానా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘లవ్ టుడే’ అనే తమిళ సినిమాతో యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఇవానా. తను తెలుగులో ఎప్పుడెప్పుడు డెబ్యూ చేస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా ఫైనల్‌గా ‘సింగిల్’తో ఆ కల నిజమయ్యింది. మే 9న ‘సింగిల్’ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.