BigTV English

IPL 2028 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పెరుగనున్న మరో 20 మ్యాచ్ లు..

IPL 2028 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పెరుగనున్న మరో 20 మ్యాచ్ లు..
Advertisement
IPL 2028 : ఐపీఎల్ మ్యాచ్ లు 2007లో మొదటి సారిగా ప్రారంభం అయ్యాయి. అయితే  ఐపీఎల్ 2007 లో లీగ్ దశలో మొత్తం 59 మ్యాచ్‌లు జరిగాయి.అంటే ఐపీఎల్ 2007,  2008లో జరిగిన టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ఒక్కొక్కటి 14 మ్యాచ్‌లు ఆడి, ఆ తర్వాత మొదటి రెండు జట్లు క్వాలిఫైయర్ 1 లో, మిగిలిన రెండు జట్లు ఎలిమినేటర్ లో తలపడ్డాయి.  ప్రస్తుతం ఐపీఎల్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి.  ఐపీఎల్ 2025 లో లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ లు  ఆడుతుంది. ఇది మొత్తం 74 మ్యాచ్ లు అవుతాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి జట్టు తమ గ్రూప్ లోని ఇతర జట్లతో రెండుసార్లు,  ఇతర గ్రూప్ లోని ఒక జట్టుతో రెండుసార్లు తలపడుతుంది.
ఇలా లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడతారు. ఆ తర్వాత మొదటి రెండు జట్లు క్వాలిఫైయర్ 1 లో, మిగిలిన రెండు జట్లు ఎలిమినేటర్ లో తలపడ్డాయి. అయితే ఐపీఎల్ లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2028 నుంచి 94 మ్యాచ్ లు నిర్వహించే యోచనలో ఉన్నట్టు లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ప్రతీ జట్టు ఇతర టీమ్ లతో రెండేసీ మ్యాచ్ లు అదేవిధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. 2025 నుంచి మ్యాచ్ ల సంఖ్యను 74 నుంచి 84 కి పెంచాలనుకున్నామని.. ఇంటర్నేషనల్ కమిట్ మెంట్స్ వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్ లో లీగ్ లోకి కొత్త ఫ్రాంచైజీలు తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 
ఇక 2025 సీజన్ ఐపీఎల్ ను పరిశీలించినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు 9 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి మూడో స్థానంలో ఉండగా.. , ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇవాళ రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 8 స్థానానికి చేరుకుంది. చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉండటం విశేషం. ఇక ఇవాళ జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ తరువాత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఇండియన్ క్రికెటర్లలో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచారు వైభవ్. 14 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతి త్వరలోనే టీమిండియా క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.


Related News

Shama Mohamed: టీమిండియాలో హిందువులే ఛాన్స్‌..”ఖాన్” అని పేరుంటే సెల‌క్ట్ చేయ‌రా ?

IND VS AUS: రేపే ఆస్ట్రేలియాతో రెండో వ‌న్డే..మిడిల్ ఆర్డ‌ర్ లో రోహిత్‌…కొత్త ఓపెన‌ర్లు ఎవ‌రంటే ?

Suryakumar Yadav: గిల్ కు సూర్య వెన్నుపోటు..టీమిండియా నుంచి తొలిగించాల‌ని కుట్ర‌లు.. చ‌క్రం తిప్పిన‌ గంభీర్

Harshit Rana: టీమిండియా వైస్ కెప్టెన్ గా హర్షిత్ రాణా ? కొన్ని రోజులైతే BCCI అధ్య‌క్షుడు అయ్యేలా ఉన్నాడే

Asif Afridi: 38 ఏళ్ల వయసులో పాక్ తరఫున అరంగేట్రం..తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు, 92 ఏళ్ల‌లో తొలిసారి

IND VS AUS: అడిలైడ్ పిచ్ పై యూవీ లైట్స్..బీసీసీఐ ప‌రువు తీస్తున్న ఆసీస్‌..!

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ బుట్ట‌లో ప‌డ్డ మ‌రో టాలీవుడ్ హీరోయిన్..సీక్రెట్ రిలేషన్ కూడా ?

IND VS PAK: మ‌రోసారి పాకిస్తాన్ తో టీమిండియా మ్యాచ్‌..నో షేక్ హ్యాండ్స్‌..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్ ఇదే

Big Stories

×