BigTV English

Pushpa 2 : తిరుపతి లడ్డూను వదలని పుష్పరాజ్… మనోభావాలు దెబ్బతింటాయేమో?

Pushpa 2 : తిరుపతి లడ్డూను వదలని పుష్పరాజ్… మనోభావాలు దెబ్బతింటాయేమో?

Pushpa 2 : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే “పుష్ప 2” విశేషాలే కనిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తిరుపతి లడ్డూ ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇలా లడ్డూ ప్రస్తావన వస్తే చాలు రీసెంట్ గా వివాదాస్పదమైన అంశాలే కళ్ళ ముందు మెదులుతాయి. అలాంటిది సుకుమార్ ఈ సినిమాలో లడ్డూ గురించి ఎందుకు ప్రస్తావించారు? అసలు ఎలాంటి సందర్భంలో ఈ లడ్డూ గురించి, ఏం మాట్లాడారు? అనే వివరాల్లోకి వెళితే…


థియేటర్లలో “పుష్ప 2 (Pushpa 2)” మాస్ జాతర మొదలైంది. సోషల్ మీడియా మొత్తం ఈ మూవీ ఎలా ఉంది? అనే అభిప్రాయాలతో, కామెంట్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఈ మూవీని థియేటర్లలో వీక్షించిన ప్రేక్షకులు ఎక్స్ వేదికగా వరుసగా ట్వీట్స్ చేస్తుండడంతో ప్రస్తుతం ‘పుష్ప 2’ ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో పుష్పరాజ్ లడ్డూ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. నిజానికి లడ్డూ గురించి అల్లు అర్జున్ (Allu Arjun) గొప్పగానే చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఓ ఢిల్లీ లీడర్ తో ఫోన్లో మాట్లాడుతూ “నేను తిరుపతి లడ్డూ లాంటోని” అని చెప్తాడని తెలుస్తోంది. కానీ ఇలా సినిమాలో శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూని వాడడం వివాదానికి తెరతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమాలో హీరో చేసేదే ఎర్రచందనం స్మగ్లింగ్. అలాంటి వ్యక్తి తనను తాను ఇలా పవిత్రమైన తిరుపతి లడ్డూతో పోల్చుకోవడం ఏంటి? మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఎవరైనా ఈ అంశాన్ని వివాదాస్పదంగా మార్చే ఛాన్స్ లేకపోలేదు.


గతంలో ‘సత్యం సుందరం’ (Satyam Sundaram) మూవీ రిలీజ్ టైంలో ఇలాగే సరదాగా కామెంట్ చేసి కోలీవుడ్ హీరో కార్తీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ‘సత్యం సుందరం’ మూవీ ఈవెంట్ హైదరాబాద్లో జరగగా, అందులో భాగంగా యాంకర్ ‘లడ్డూ కావాలా నాయనా’ అని ప్రశ్నించింది. అప్పటికే ఏపీలో కల్తీ లడ్డూ వివాదం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే కార్తీ ‘అది సెన్సిటివ్ టాపిక్’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కార్తీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

తిరుపతి లడ్డూపై ఇలా సినిమాలలో ఫన్నీగా మాట్లాడడం ఏంటి? అంటూ పలువురు ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. దీంతో కార్తీతో పాటు ఆయన సోదరుడు సూర్య, ఆయన తండ్రి అందరూ కలిసి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలో మళ్లీ లడ్డూ గురించి ప్రస్తావన రావడంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? పుష్పరాజ్ విషయంలో లడ్డూ ప్రస్తావన నెగిటివ్ గా మారుతుందా ? పాజిటివ్ గా మారుతుందా ? అనేది చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×