BigTV English

Thandel : అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కారణంగా ‘తండేల్’ సినిమా రూపొందిందని తెలుసా?

Thandel : అల్లు అర్జున్  ఆటోగ్రాఫ్ కారణంగా ‘తండేల్’ సినిమా రూపొందిందని తెలుసా?

Thandel : అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘తండేల్’ (Thandel). ఈ మూవీ మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) కారణంగా ఈ మూవీ తెరపైకి వచ్చిందనే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అల్లు అర్జున్ కు, తండేల్ మూవీతో ఉన్న లింక్ ఏంటి? ఆయన కారణంగా ఈ మూవీ ఎలా పట్టాలెక్కింది అనే వివరాల్లోకి వెళితే…


అల్లు అర్జున్ వల్లే ‘తండేల్’ మూవీ తెరపైకి…

‘తండేల్’ మూవీ పాక్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా, అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కింది ఈ మూవీ. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన తండేల్ 4 రోజుల్లోనే 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమాకు అల్లు అరవింద్ తనయుడు, ఐకాన్ స్టోర్ అల్లు అర్జున్ తో లింక్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. తాజా సమాచారం ప్రకారం ఒక పాక్ జైలర్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడిగాడని, అది ‘తండేల్’ మూవీ మేకింగ్ కి దారి తీసింది అని తెలుస్తోంది.


పాక్ జైలర్ బన్నీకి వీరాభిమాని 

పాక్ జైలర్ అక్కడ చిక్కుకున్న ఇండియన్ జాలర్లకు తన చిరునామా ఇచ్చి, అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ను తనకు పంపమని అడిగిన సందర్భాన్ని నిర్మాత బన్నీ వాసు ఇటీవల వెల్లడించారు. పాక్ జైలులో ఉన్నప్పుడు ఇండియన్ జాలర్లకు ఆ జైలర్ హెల్ప్ చేశాడట. అంతేకాకుండా ఆయన అల్లు అర్జున్ కి పెద్ద అభిమాని. అందుకే మత్స్యకారులు ఇండియాకు తిరిగి వస్తున్నప్పుడు, అందులో ఒకరు ఒక రచయితను కలిసి విషయం చెప్పారట. దీంతో అతను ఆటోగ్రాఫ్ కోసం గీతా ఆర్ట్స్ ను సంప్రదించాడని తెలుస్తోంది. ఆ విధంగా అక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న నిర్మాత బన్నీ వాసు ఈ మూవీని తీయాలని నిర్ణయించుకున్నారట.

కాగా శ్రీకాకుళం నుంచి మొత్తం 22 మంది జాలర్లు పాక్ జలాల్లోకి అనుకోకుండా ప్రవేశించి దాదాపు 13 నెలల పాటు అక్కడ జైలు శిక్షను అనుభవించారు. ఇదే స్టోరీ ఆధారంగా ‘తండేల్’ మూవీ తెరకెక్కింది.

ఇక ‘పుష్ప’ తరువాత అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా జరిగిన ఈవెంట్లో ‘పుష్ప :ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలలో మంగళం శ్రీను పాత్రను పోషించిన సునీల్ తన పాపులారిటీ ఎలా పెరిగిందో వెల్లడించారు. విదేశాల్లో పాక్ రెస్టారెంట్ యజమానులు తనను గుర్తు పట్టి, ఎలా ఆదరించారో వెల్లడించాడు. సునీల్ మాట్లాడుతూ రాత్రి పది గంటల తర్వాత ఓ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నామని, అయితే ఓ రెస్టారెంట్ ఓనర్ తనను చూశాక ‘పుష్ప’ మూవీ నటుడని గుర్తించారని వెల్లడించారు. పాక్ రెస్టారెంట్ యజమానులు ఆ రెస్టారెంట్ ను క్లోజ్ చేసినప్పటికీ తమ కోసమే ఆ రాత్రి స్పెషల్ గా వంట చేశారని సునీల్ చెప్పుకొచ్చారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×