Honeymoon Express Movie: ప్రేక్షకులు చూస్తున్నది కేవలం కంటెంట్ గురించే. సినిమా ఎవరు తీశారన్నది ముఖ్యం కాదు.. అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా.. అందులో కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మంచి కంటెంట్ తో వచ్చి చాలా సినిమాలు ఫుల్ సక్సెస్ అవుతున్నాయి. ఇదే కోవకు చెందిందే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ. ఈ సినిమా చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. సినిమా సూపర్ ఉందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో తెగ క్రేజ్ ను సంపాదించుకుంది. 40 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో అమెజాన్ ప్రైమ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంది. హీరోయిన్ – హీరో కెమిస్ట్రీకి మంచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.
Also Read: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీకి ప్రముఖ డైరెక్టర్ బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతం అందించగా.. ఈ సినిమాలో మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. కేకేఆర్, బాలరాజ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు సిస్ల్టా పీఎంకే కెమెరా వర్క్ చేశాడు. ఆయన పనితనానికి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు కూడా ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ వస్తున్నది. కాగా, ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు.
ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ ను కూడా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల ఆధారంగా ఈ సినిమాను అందరూ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీశారు. ఇక ఈ సినిమాకు ఓటీటీలో ఇప్పటికే 40 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఇంకెంతమందిని ఆకట్టుకుని.. ఎన్ని రికార్డులు బ్రేక్ చేయనున్నదో అనేది చూడాలి.
Also Read: ఇప్పటినుండి అన్నా అని పిలుస్తా, ఇది నువ్వు ఫిక్స్ అయిపో.. సైమా స్టేజ్‌పై నాని, విజయ్